Political News

మూడో బిడ్డకు 30 వేలు.. నాలుగో బిడ్డకు 40 వేలు

ఏపీలో జనాభా పెరుగుదలకు కూటమి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కూటమి రథసారధి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం సంచలన ప్రకటన చేశారు. శ్రీకాకుళంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంద్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు… రాష్ట్రంలో క్రమంగా జనాభా తగ్గుతోందని, ఇది ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. ఈ ఆందోళనను తగ్గించేలా జనాభా పెరుగుదలకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అధిక సంఖ్యలో పిల్లలను కనే కుటుంబాలకు ప్రభుత్వం నుంచి తక్షణ ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఆయన ప్రకటించారు.

ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మూడో బిడ్డకు జన్మనిచ్చే కుటుంబానికి బిడ్డ పుట్టిన వెంటనే రూ.30 వేలను అందజేస్తామని చంద్రబాబు తెలిపారు. అదే సమయంలో నాలుగో బిడ్డ పుడితే రూ.40 వేలు అందజేస్తామని ఆయన తెలిపారు. పిల్లలు కుటుంబాలకు భారం కాదని… పిల్లలే ఆయా కుటుంబాలకు సంపద అనే విషయాన్ని చేసి చూపిస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తల్లికి వందనం కింద ఒక్కో బిడ్డకు రూ.15 వేలు ఇస్తున్నామని గుర్తు చేసిన చంద్రబాబు… దేవుడి దయ బాగుంటే తల్లికి వందనం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచుతామని తెలిపారు.

రాష్ట్రంలో జనాభా తరుగుదల గురించి చాలా కాలం నుంచే చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. జనాభా తరుగుదల వల్ల సమాజం సమతుల్యత కోల్పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విభజిత ఏపీకి రెండో సారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర జనాభాను పెంచే దిశగా ఆయన చర్యలను ప్రారంభించారు.

ఇందుకోసం ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు అందించే దిశగా ఆయన కార్యాచరణ ప్రారంభించారు. అందులో భాగంగా ఇద్దరు పిల్లలను దాటుకుని మూడు, నాలుగు మంది బిడ్డలను కనే కుటుంబాలకు తొలిసారి ఆర్థిక ప్రోత్సాహాలను ప్రకటిస్తూ చంద్రబాబు శనివారం కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్రంలో జనాభా పెరుగుదల దిశగా చర్యలు మొదలైనట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on May 16, 2026 8:17 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

37 minutes ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

1 hour ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

3 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

3 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

4 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago