Movie News

కూతురి డేటింగ్.. కియారా కామెంట్‌పై దుమారం

బాలీవుడ్ అగ్ర క‌థానాయిక‌ల్లో ఒక‌రైన కియారా అద్వానీ.. కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే త‌న స‌హ న‌టుడు సిద్దార్థ్ మ‌ల్హోత్రాను పెళ్లి చేసుకుని వ్య‌క్తిగ‌త జీవితంలో స్థిర‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అలా అని ఆమె సినిమాలేమీ వ‌దిలేయ‌లేదు. టాప్ ఫామ్‌ను కొనసాగిస్తోంది. గ‌త ఏడాది ఒక బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చాక కూడా ఆమె కెరీర్లో దూసుకెళ్తోంది.

పెళ్లి త‌ర్వాత కూడా ఫుల్ గ్లామ‌ర‌స్ రోల్స్ చేస్తూ తాను ఆధునిక అమ్మాయిని అని చాటుతున్న కియారా.. తాజాగా ఒక పాడ్ కాస్ట్‌లో కూతురు స‌ర‌యా విష‌యంలోనూ అంతే ఆధునికంగా ఉంటానంటూ చేసిన కొన్ని కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.

ప్రస్తుతం సమాజంలోని అబ్బాయిల గురించి మీ అమ్మాయికి ఏం చెప్తారని హోస్ట్ ప్రశ్నించ‌గా.. అందుకు కియారా ఇచ్చిన జ‌వాబు విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. త‌న కూతురు ఎంత మందితోనైనా డేటింగ్ చేయొచ్చని, వారిలో ఎవ్వ‌రినీ పెళ్లి చేసుకోకపోయినా ఫర్వాలేదని ఆమె కామెంట్ చేసింది.

‘‘నా కూతురు ఫుల్ లైఫ్ చూడాలని అనుకుంటా. ఆమె ఒక్క వ్యక్తితోనే డేటింగ్ చేయాలని లేదు. ఆమెపై ఎలాంటి ఆంక్షలు విధించను. పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోవ‌చ్చు. లేదంటే లేదు. డేట్ చేసిన ప్రతి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు అలాగే జరిగింది. చివరకు సరైన వ్యక్తి దొరికాడు. మ‌న రిలేష‌న్‌షిప్స్ విష‌యంలో ప‌శ్చాత్తాపం అవ‌స‌రం లేదు. ఎదిగే క్రమంలో ఈ రిలేషన్‌షిప్స్ అన్నీ పాఠాలు నేర్పిస్తాయి. మనల్ని మనిషిగా మారుస్తాయి. జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి. పొరపాట్లు అందరూ చేస్తారు. కానీ ఆ తప్పుల నుంచి నేర్చుకుంటారు’’ అని కియారా వ్యాఖ్యానించింది.

ఐతే ఈ వ్యాఖ్య‌ల‌పై సంప్ర‌దాయ వాదులు మండిపడుతున్నారు. ఇదేనా మ‌న క‌ల్చ‌ర్..పిల్ల‌ల‌కు ఇదేనా నేర్పించేది అని ప్ర‌శ్నిస్తున్నారు. రిలేష‌న్‌షిప్స్‌ను ఇంత తేలిగ్గా తీసుకోవ‌డం.. ఎంత‌మందితో అయినా డేట్ చేయ‌మ‌ని ఒక త‌ల్లి చెప్ప‌డం క‌రెక్టా అని అడుగుతున్నారు. ఐతే కియారా చెప్పిన దాంట్లో త‌ప్పేముంద‌ని.. కాలం ఎంతో మారింద‌ని, అందులోనూ కియారా కూతురు ఎదిగే స‌మ‌యానికి ఉండే ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లే కియారా మాట్లాడుతోంద‌ని ఆమెను కొంద‌రు స‌మ‌ర్థిస్తున్నారు.

This post was last modified on May 16, 2026 2:44 pm

Share

Recent Posts

రీమేక్ సినిమాలో ఫ్రీగా నటిస్తానన్న విజయ్

గత కొన్నేళ్లలో తమిళం నుంచి వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ‘మహారాజ’ ఒకటి. నిథిలన్ స్వామినాథన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన…

2 hours ago

దానం ఆశించిందేంటి? జ‌రిగిందేంటి?

తెలంగాణ‌లోని ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ ప‌ద‌విని కోల్పోయారు. ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టంలోని సెక్ష‌న్ 10 మేర‌కు ఆయ‌న ప‌ద‌విపై…

3 hours ago

స్టార్ల గిమ్మిక్కులు పని చేయడం లేదు

స్టార్ కాంబినేషన్లు పెట్టుకుని సరైన కథా కథనాలు లేకుండా సినిమాలు తీస్తే జనాలు ఎగబడి చూసే రోజులు పోయాయి. ముఖ్యంగా…

3 hours ago

తెలంగాణ‌లో జంపింగుల ప‌ర్వం కొత్తగా వచ్చింది కాదు

తెలంగాణలో రాజ‌కీయాల్లో 2014 నుంచి కూడా జంపింగుల ప‌ర్వం కొన‌సాగుతోంది. నేడు కొత్త‌గా వ‌చ్చింది కాదు.. భ‌విష్య‌త్తుల్లో పోయేదీ కాదని…

4 hours ago

హైదరాబాద్ ఐమాక్స్ వారణాసికి ముందే

దేశంలోనే అత్యధిక‌ సినీ అభిమానం ఉన్న‌ది తెలుగు రాష్ట్రాల్లోనే అంటే అతిశ‌యోక్తేమీ కాదు. కానీ ఇంత‌టి అభిమానం ఉన్న చోట…

10 hours ago

బెంగాల్ రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు

ప‌శ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘ‌కాలం పాటు పాల‌న సాగించిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప‌రాజ‌యం…

12 hours ago