Political News

భ‌గీర‌థ్ కోసం లుకౌట్ నోటీసులు

బాలిక‌పై లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న భ‌గీర‌థ్ విష‌యంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఆయ‌న దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు .. తెలంగాణ పోలీసులు.. వైమానిక శాఖ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా లుకౌట్‌(క‌నిపిస్తే.. ప‌ట్టేయండి) నోటీసులు జారీ చేశారు. దేశ‌వ్యాప్తంగా అన్ని విమానాశ్ర‌యాల్లోనూ ఈ ఉత్త‌ర్వులు అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్టు అయింది.

మ‌రోవైపు.. భ‌గీర‌థ్‌కు తెలంగాణ హైకోర్టు ముంద‌స్తు బెయిల్ నిరాక‌రించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే.. ఏక్ష‌ణ‌మైనా.. విదేశాల‌కు పారిపోయే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్న అధికారులు లుకౌట్ నోటీసులు ఇష్యూ చేశారు.

మ‌రోవైపు.. ఐదు బృందాలుగా ఏర్ప‌డిన పోలీసులు భ‌గీర‌థ్ కోసం గాలిస్తున్నారు. ఆయ‌న ఎక్క‌డున్నా ప‌ట్టుకుని తీరుతామ‌ని అధికారులు చెబుతున్నారు. అతని నివాసంలోనూ.. పోలీసులు త‌నిఖీలు చేయ‌డం గ‌మ‌నార్హం.

దీనికి సంబంధించి కోర్టు వారెంటు కూడా తీసుకున్నారు. కాగా.. ప్ర‌స్తుతం భ‌గీర‌థ్ కారు డ్రైవ‌ర్ నుంచి స్నేహితుల వ‌ర‌కు దాదాపు 30-50 మంది క‌రీంన‌గ‌ర్ పోలీసుల అదుపులో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

This post was last modified on May 16, 2026 3:01 pm

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

2 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

4 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

5 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

5 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

6 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

7 hours ago