ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ లు చేపట్టిన ఆందోళన ప్రభావం కేంద్ర ప్రభుత్వం మీద ఎంతో తీవ్రమైన ఎఫెక్ట్ చూపించింది. విద్యార్థుల దెబ్బకు తొలిసారిగా కేంద్రంలో ఒక మంత్రి చేత రాజీనామా చేయించారు. బీజేపీ మాతృసంస్థ అధిపతి మోహన్ భగవత్ యువతతో మాటామంతి చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కనిపించకుండా ముఖం చాటేశారు. ఇప్పుడు తాజాగా స్వాతంత్ర్య వేడుకల్లో కూడా యువతను పిలిచి పెద్ద పీట వేస్తున్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి తగిన గౌరవం ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఇదంతా కాక్రోచ్ ఉద్యమ ప్రభావమేనని విశ్లేషకులు చెబుతున్నారు.
భారత 80వ స్వాతంత్ర్య వేడుకలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. ఈ వేడుకలకు సంబందించి కేంద్ర ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. వేడుకల్లో జెన్ జీ కి విశేష ప్రధాన్యత కల్పించనున్నారు. 19 మంది యువ మేధావులను ఎర్రకోట ప్రధాన వేదిక వద్ద ప్రధాని మోదీకి సమీపంలో సీట్లు కేటాయించారు. రైతు ఉద్యమాలు ఉధృతం అవుతున్న నేపథ్యంలో స్వాతంత్ర్య వేడుకలను తిలకించేందుకు పలువురు రైతులకు కూడా ఆహ్వానాలు పంపించారు.
ఎర్రకోటకు ప్రధాన మార్గంలా వుండే జ్ఞాన్ పథ్ మార్గంలో మరో 2500 మంది ఎన్సీసీ అభ్యర్థులు, వైస్ కార్ప్స్ వాలంటీర్లు కలిసి వందేమాతరం ఆకారంలో ప్రదర్శన నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో ఎన్నడూ ఇవ్వనంతగా ఈసారి యువతకు ప్రాధాన్యత కల్పించాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
మరో ముఖ్యమైన మార్పు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి తగిన గౌరవం ఇవ్వడం. గత ఏడాది జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో రాహుల్ గాంధీకి ఐదవ వరసలో సీటు కేటాయించి అవమానించారు. ప్రధాన మంత్రి తర్వాత అంతటి హోదా కలిగిన ప్రతిపక్ష నేతకు వెనక వరసలో సీటు కేటాయించడం సమర్ధనీయం కాదని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి మారినట్లు కనిపిస్తుంది. ఈసారి వేడుకల్లో రాహుల్ గాంధీకి మంత్రుల తర్వాత సీటు కేటాయిస్తున్నట్లు పార్లమెంటులో ప్రకటించారు. నిబంధనల ప్రకారం ఆయనకు సీటు కేటాయిన్నట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
నిన్నా మొన్నటి వరకు ఏక పక్షంగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వంలో కనిపిస్తున్న మార్పును ప్రజాస్వామిక వాదులు స్వాగతిస్తున్నారు. పాలక ప్రతిపక్ష పార్టీలు బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం వుందని, ముఖ్యంగా పాలక వర్గం అందరినీ కలుపుకొని పోవడం గౌరవంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జెన్ జీ ప్రభావం కనిపిస్తున్న దశలో ప్రభుత్వం అప్రమత్తమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
This post was last modified on August 11, 2026 11:49 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…