Political News

త్రిషకు అంత ప్రాధాన్యమిచ్చారెంటీ?

మొత్తానికి ఉత్కంఠకు తెరపడింది. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన రెండేళ్లకే ఎన్నికల్లో అద్భుత ఫలితాలు రాబట్టిన తమిళ స్టార్ హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాడు. ఈ రోజు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో తన చేత గవర్నర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు.

విజయ్ ఒక్క పిలుపునిస్తే లక్షల మంది అభిమానులు ప్రమాణ స్వీకారానికి తరలివచ్చేవారు కానీ.. వారిని అదుపు చేయడం కష్టమని స్టేడియంలో పరిమిత సంఖ్యలో అతిథులు, అభిమానుల మధ్య ప్రమాణ స్వీకార వేడుకను ముగించారు.

కానీ కోట్లమంది టీవీల్లో తమ అభిమాన నటుడు, నాయకుడి ప్రమాణ స్వీకారాన్ని చూసి పులకించిపోయారు. ఇక ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ మాత్రం త్రిషనే అనడంలో సందేహం లేదు. విజయ్‌తో అధికారికంగా ఏ బంధం లేకపోయినా సరే.. ఆమెకు ఈ వేడుకలో ముందు వరుసలో సీటు దక్కడం విశేషం.

విజయ్ తల్లిదండ్రులు చంద్రశేఖర్, శోభతో పాటు మరి కొంతమంది ముఖ్య అతిథులకు మాత్రమే తొలి వరుసలో సీటు దక్కింది. త్రిషకు కూడా అక్కడే సీటు ఇవ్వడాన్ని బట్టి ఆమెకు ఎంత ప్రాధాన్యం దక్కిందన్నది అర్థం చేసుకోవచ్చు. విశేషం ఏంటంటే.. త్రిషతో పాటు ఆమె తల్లి సైతం ఈ వేడుకకు హాజరైంది. ఇది మరింతగా చర్చనీయాంశం అయింది.

త్రిష జస్ట్ వచ్చి సీటులో కూర్చోవడం కాకుండా.. స్టేడియంలో ఉన్న అభిమానులందరికీ చేయి ఊపుతో అభివాదం కూడా చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ వేడుకలో త్రిషకు దక్కిన ప్రాధాన్యం, ఆమె వ్యవహరించిన తీరు.. భవిష్యత్తుపై అందరికీ ఒక అంచనా వచ్చేలా చేసింది.

This post was last modified on May 11, 2026 8:49 am

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

34 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago