Political News

ఆర్టీసీ బస్సును ఛేజ్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే

వాహనాలను ఛేజ్ చేయడాన్ని మనం సినిమాల్లోనే చూస్తుంటాం. ఇక రియల్ లైఫ్ లో కూడా అక్కడక్కడ వెహికిల్ ఛేజ్ ఘటనలు చోటుచేసుకుంటున్నా… వాటిని ఛేజ్ చేసే వారు పోలీసులే అయి ఉంటారు. అయితే అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సర్కారీ ఆధీనంలోని ఆర్టీసీ బస్సును ఛేజ్ చేశారు.

ప్రయాణికులతో స్పీడుగా వెళుతున్న ఆ బస్సును తన కారుతో వెంబడించిన సదరు ఎమ్మెల్యే బస్సును ఆపారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని కంకిపాడు, పెనమలూరు మధ్యన గురువారం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును ఛేజ్ చేసింది మరోవరో కాదు… పెనమలూరు ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత బోడె ప్రసాద్ ఆ బస్సును ఆపారు.

ఈ ఛేజింగ్ సీన్ దేనికన్నవిషయానికి వస్తే… ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక… ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సర్కారు అమలు చేస్తున్న ఈ పథకం పట్ల మహిళల్లో హర్షం వ్యక్తం అవుతోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ సిబ్బంది నిర్వాకం వల్ల ఈ పథకం లబ్ధిదారులకు సరిగ్గా అందడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఈ క్రమంలో గురువారం విజయవాడ నుంచి పెనమలూరు వెళుతున్న క్రమంలో ప్రయాణికులు బస్టాప్ వద్ద బస్ కోసం వేచి చూస్తున్నా… ఓ ఆర్టీసీ బస్సు సదరు స్టాప్ లో ఆగకుండా అలా స్పీడుగా వెళ్లిపోయింది. దీనిని గమనించిన బోడె ప్రసాద్ వెంటనే ఆ బస్సును వెంబడించారు.

తన వాహనాన్ని స్పీడుగాముందుకు ఉరికించిన బోడె…చివరకు ఆ బస్సును అధిగమించి దానిని ఆపారు. ఆ తర్వాత బస్సులోకి ఎక్కిన బోడె… ప్రయాణికులు ఉన్నా బస్టాప్ లో నిలబెట్టకుండా ఎందుకు వెళుతున్నారంటూ ఆయన బస్సు డ్రైవర్, కండక్టర్ లను నిలదీశారు.

రోడ్డుపై ఎక్కడ ప్రయాణికులు చేయెత్తినా బస్సును ఆపి వారిని ఎక్కించుకోవాలన్న ప్రాథమిక సూత్రాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని బోడె ఆర్టీసీ సిబ్బందిని నిలదీశారు. ఈ తరహాలో కొందరు ఆర్టీసీ సిబ్బంది నిర్దేశిత బస్సు స్టాప్ లలో బస్సులను ఆపకుండా వెళుతున్నారని… ఫలితంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అభాసుపాలు అవుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకపై ఈ తరహా ఉల్లంఘనలను సహించేది లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉరిత బస్సు ప్రయాణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రయాణికులకు సూచించారు.

This post was last modified on May 7, 2026 10:02 pm

Share

Recent Posts

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

1 hour ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

6 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

7 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

8 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

8 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

10 hours ago