వాల్తేరు వీరయ్య సెంటిమెంట్ రిపీట్ చేస్తూ మెగా 158 సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలనేది దర్శకుడు బాబీ లక్ష్యం. అయితే అది నెరవేరే సూచనలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానే లేదు. మార్చి అన్నారు తర్వాత ఏప్రిల్ అన్నారు. ఇప్పుడు మే వచ్చేసింది. రేపో ఎల్లుండో స్టార్ట్ అవ్వొచ్చు. ఇటీవలే ఫోటో షూట్ చేసి చిరంజీవి స్టిల్స్ అన్నీ ఓకే చేసుకున్నారు. ఇక్కడో సమస్య ఉంది.
మే మినహాయిస్తే కేవలం ఏడు నెలల్లో ఇంత పెద్ద ప్రాజెక్టు పూర్తి చేయడం అంత సులభం కాదు. పైగా కోల్కతా బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు. ఖచ్చితంగా అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ కు జన నాయకుడు రిలీజ్ సమస్య ఇంకా తీరనే లేదు. ఈ నెలాఖరుకు అయిపోవచ్చని అంటున్నారు. టాక్సిక్ వ్యవహారం ఇంచుమించు అలాగే ఉంది. జూన్ 4 వదిలేసుకున్నాక మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో క్లారిటీ లేదు.ఇటీవలే రిలీజైన కెడి డెవిల్ ఫ్లాప్ అయ్యింది.
సో మెగా 158 వచ్చే సంవత్సరం వేసవికి వెళ్లడం మినహా వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. అప్పుడు కూడా చూసి అడుగులు వేయాలి. ఎందుకంటే జూన్ లో జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్యాన్ ఇండియా మూవీ ఉంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో వరసగా స్పిరిట్, వారణాసి వస్తాయి. ఇన్ని ప్యాన్ ఇండియా మూవీస్ మధ్య మెగా 158కి సరైన స్లాట్ పట్టుకోవడం సవాల్ లాంటిది. ముందైతే సెట్స్ లో అడుగు పెడితే తర్వాత లెక్కలు వేసుకొచ్చు కానీ కొబ్బరికాయ కొట్టడమే అసలు సమస్య.
ఇదిలా ఉంచితే చిరంజీవి అభిమానులు విశ్వంభర కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పటికి వస్తుందో ఎవరికి తెలియదు. యువి క్రియేషన్స్ నుంచి అప్డేట్ లేదు. ఇన్ సైడ్ టాక్ అయితే దసరా లేదా దీపావళి అని ఉంది. అదంత ఈజీ కాదు. ఎందుకంటే దివాలి పండక్కు రామాయణ పార్ట్ 1 ఉంది కాబట్టి దాని కన్నా ముందే వస్తే బాగుంటుంది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న మెగా 158 చిరు భార్యగా ప్రియమణి నటించనుంది. ఇందులో డ్యూయెట్లు గట్రా ఉండవు.
This post was last modified on May 7, 2026 10:46 pm
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…