ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ తన పట్టును వరుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోందని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నేతృత్వంలో.. ముందుకు సాగిన కమల దళానికి అసోం ప్రజలు బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నాయి. గత పది సంవత్సరాలుగా ఇక్కడ బీజేపీ పాలనే సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపేందుకు కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేసింది. వరుస ప్రచారాలతో రాహుల్ గాంధీ దుమ్మురేపారు. అయినప్పటికీ.. అసోంలో బీజేపీదే పైచేయి అని తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి.
అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటికి ఈ నెల 23న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మంగళవారం సాయంత్రంతో ముగియడంతో.. పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడిం చాయి. ఒకటి రెండు సంస్థలు మాత్రమే కాంగ్రెస్‌కు కొంత మేరకు ఎడ్జ్ ఉందని చెప్పగా.. మెజారిటీ సంస్థలన్నీ.. బీజేపీకే పట్టం కట్టాయి. ప్రజల నాడిని అర్ధం చేసుకున్న నాయకుడిగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ముందున్నారని సర్వేలు పేర్కొన్నా యి. అంతేకాదు.. కనుచూపు మేరలో కూడా కాంగ్రెస్ పుంజుకుంటున్న పరిస్థితి లేదని సర్వేలు పేర్కొన్నాయి.
ఇదీ ఎగ్జిట్ పోల్ అంచనా..
చాణక్య స్ట్రాటజీస్: బీజేపీ: 88-98, కాంగ్రెస్: 22-32
పీపుల్స్ పల్స్: బీజేపీ: 68-72, కాంగ్రెస్: 22-26
పల్స్ టుడే: బీజేపీ: 88-92, కాంగ్రెస్: 28-32
ఎస్ ఏ ఎస్ గ్రూప్: బీజేపీ: 84-90, కాంగ్రెస్: 40-46
బెంచ్ మార్క్ సర్వే: బీజేపీ: 72-85, కాంగ్రెస్: 37-48
యాక్సిస్ మై ఇండియా: బీజేపీ: 88-100, కాంగ్రెస్: 24-36
పోల్ ల్యాబ్: బీజేపీ 89-90, కాంగ్రెస్: 31-32
Gulte Telugu Telugu Political and Movie News Updates