Political News

ప‌సుపు జెండా పౌరుషం ఎప్పుడూ త‌గ్గ‌లేదు

టీడీపీ నూత‌న కార్య‌వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారం ఘ‌నంగా జ‌రిగింది. ఇటీవ‌ల పార్టీలో జాతీయ‌, రాష్ట్ర స్థాయి కార్య‌వ‌ర్గాల‌తోపాటు.. పొలిట్ బ్యూరోను కూడా ప్ర‌క్షాళ‌న చేశారు. తాజాగా కొత్త నాయ‌క‌త్వంతో పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం చేయించారు. దీనికి ముందు .. కార్య‌క్ర‌మం అనం త‌రం కూడా .. చంద్ర‌బాబు నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కార్య‌క‌ర్త‌ల్లో స్ఫూర్తి నింపే ప్ర‌య‌త్నం చేశారు.

పార్టీలు ఎన్నో వ‌స్తుంటాయి.. పోతుంటాయ‌ని.. కానీ, ఎన్ని ఒడిదుడుకులువ‌చ్చినా.. టీడీపీ ఎదురు నిలిచి నిలిచింద‌ని చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. పార్టీ ఆవిర్భావమే ఒక సంచ‌ల‌న‌మ‌న్న ఆయ‌న‌.. తొలి నాళ్ల‌లో స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే పార్టీ అధికారంలోకి వ‌చ్చింద‌ని తెలిపారు. అధికారంలో ఉన్న‌ప్పుడూ.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా.. టీడీపీ ప్ర‌జా పక్షమేనన్నారు. ఓడిపోయిన పార్టీలు అస్తిత్వం కోసం పాకులాడుతున్న ప‌రిస్థితి క‌ళ్ల ముందే క‌నిపిస్తోంద‌ని వైసీపీని ఉద్దేశించి ప‌రోక్షంగా వ్యాఖ్యానించారు.

కానీ, టీడీపీ ప‌సుపు జెండా ఓడినా.. గెలిచినా.. పౌరుషం ఎప్పుడూ త‌గ్గ‌లేద‌ని చంద్ర‌బాబు నొక్కి చెప్పారు. కార్య‌క‌ర్త‌ల‌కు శిక్ష‌ణ ఇచ్చే ఏకైక పార్టీ టీడీపీనేన‌ని తెలిపారు. టీడీపీకి సంక్షోభాలు కొత్త‌కాద‌ని.. కానీ, సంక్షోభాలు ఎదురైన ప్ర‌తిసారీ వాటిని స‌వాళ్లుగా తీసుకుని ముందుకు సాగింద‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. 44 ఏళ్ల పార్టీ ప్ర‌స్థానంలో తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని.. న‌లుదిశ‌లా వ్యాపించేలా చేసింద‌న్నారు. ప్ర‌స్తుతం ఒక్క ఓట‌మితోనే ప‌క్క‌కు పోతున్న పార్టీలు అనేకం ఉన్నాయ‌ని.. కానీ, టీడీపీ స‌గ‌ర్వంగా నిలిచింద‌ని పేర్కొన్నారు.

గ‌త ఎన్నిక‌ల కంటే..

గ‌త 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యం కంటే కూడా 2029లో మ‌రింత ఎక్కువ‌గా విజ‌యం ద‌క్కించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చంద్ర‌బాబు నిర్దేశించారు. ఈ దిశ‌గా కార్య‌క‌ర్త‌ల‌ను ముందుకు న‌డిపించే బాధ్య‌త కొత్త కార్య‌వ‌ర్గానికి ఉంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ పార్టీ సిద్ధాంతాల‌ను అనుస‌రించాల‌ని.. సూచించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రింత ఓటింగ్ పెరిగేలా కృషి చేయాల‌ని నిర్దేశించారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌కు టీడీపీనే కీల‌క భూమిక పోషిస్తోంద‌ని ఉద్ఘాటించారు. మ‌హిళ‌ల‌కు రాజ‌కీయంగా ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ కూడా టీడీపీనేన‌ని చెప్పారు.

This post was last modified on April 29, 2026 3:19 pm

Share

Recent Posts

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

9 minutes ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

2 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

2 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

2 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

3 hours ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

6 hours ago