అది ఢిల్లీ హైకోర్టు. ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారణను ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జరిగాయి. వర్చువల్ విచారణలో న్యాయవాదులు.. తమ తమ వాదనలను బలంగా వినిపిస్తున్నారు. ఈ విషయాలను.. ప్రధాన న్యాయమూర్తి అత్యంత ఆసక్తిగా ఆలకిస్తున్నారు. ఇంతలో హఠాత్తుగా.. స్క్రీన్‌పై సెక్స్ వీడియోలు దర్శన మిచ్చాయి. పోర్న్ దృశ్యాలు కనిపించాయి. అంతే.. ఒక్కసారిగా జడ్జిగారు హతాశులయ్యారు. అసలు ఏం జరిగిందని.. అని నిప్పులు చెరిగారు. ఆ వెంటనే వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరుగుతున్న విచారణను తొలుత నిలిపివేశారు. అనంతరం అన్నీ రీస్టార్ట్ చేశారు.
అంతా ఫర్వాలేదు అని నిర్ధారించుకుని.. మరోసారి విచారణను చేపట్టారు. మళ్లీ ఓ 10 నిమిషాలు గడిచాయి. వాదనలను బలంగా వినిపిస్తున్న వైనాన్ని ప్రధాన న్యాయమూర్తి ఆసక్తిగా వింటూ.. వాటిని నమోదు చేసుకుంటున్నారు. అంతే! మళ్లీ పరిస్థితి భయంకరం.. వెంటనే పోర్న్ వీడియోలు హల్చల్ చేశాయి. దీంతో ప్రధాన న్యాయమూర్తి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఇదేదో ఎవరో ఉద్దేశ పూర్వంగా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కానీ, ఇంతలోనే మీరు హ్యాక్ అయ్యారు అంటూ.. స్క్రీన్‌పై సందేశంతో పాటు వాయిస్ కూడా వినిపించింది.
దీంతో కోర్టులోని సాంకేతిక సిబ్బంది.. వెంటనే వీడియో కాన్ఫరెన్సును నిలిపివేశారు. అయితే.. ఇది ఎలా సాధ్యం అవుతుందన్నది కీలక ప్రశ్న. నిజానికి హైకోర్టుల్లో జరిగే విచారణల సమయంలో అన్నీ పక్కాగా నిర్ధారించుకున్నాకే.. వాదనలు వినిపించేందుకు అవకాశం ఉంటుంది. కానీ.. దీనికి భిన్నంగా వ్యవహారం మారిపోయింది. అవతలి వ్యక్తులు.. వీడియో కాన్ఫరెన్సు జరుగుతున్న స్క్రీన్‌ను హ్యాక్ చేసి.. దానిలో వారికి నచ్చిన సెక్స్ కంటెంట్‌ను ప్రసారం చేశారని అధికారులు గుర్తించారు. ఆ వెంటనే ఐడీల సాయంతో నిందితులను కూడా గుర్తించారు. ఈ ఘటన న్యాయ వ్యవస్థలో సంచలనం సృష్టించింది.
నిందితుల కోసం..
ఈ అసభ్యకర సెక్స్ కంటెంట్‌ను ప్లే చేసిన నిందితులను శ్రీధర్‌సర్నోబత్, షిత్ జిత్ సింగ్‌గా గుర్తించారు. వారి పేర్లతోనే స్క్రీన్‌పై వివరాలు లభించాయని చెప్పారు. దీంతో వారిని గుర్తించేందుకు.. అరెస్టు చేసేందుకు అధికారులు ప్రత్యేక సైబర్ దర్యాప్తు బృందాలను నియమించారు. ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని.. నిందితులను అరెస్టు చేస్తామని ఢిల్లీ సైబర్ పోలీసు విభాగం స్పష్టం చేసింది. మరోవైపు.. ఈ ఘటనతో ప్రధాన న్యాయమూర్తి.. విచారణలను అన్నింటినీ వాయిదావేశారు. ఆ వెంటనే ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి..సైబర్ భద్రతపై సమీక్షించారు.
This post was last modified on April 29, 2026 8:26 pm
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
తన చేతికి గాయం అయింది సర్జరీ చేసుకుంటున్నా అంటూ కొన్ని నెలల ముందు షాకింగ్ అప్‌డేట్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…