మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి వాయిదా వేశాక కొత్త డేట్ ఏంటనే దాని మీద రకరకాల ఊహాగానాలు రేగుతూనే ఉన్నాయి. కర ప్రీ రిలీజ్ ఈవెంట్లో బుచ్చిబాబు స్వయంగా జూన్ 25 అని చెప్పేయడంతో అందరూ అదే ఫిక్స్ అనుకున్నారు. కానీ అసలు ట్విస్ట్ వేరే ఉంది. ప్రాధమికంగా ఆ డేట్ అనుకున్న మాట వాస్తవమే కానీ టాక్సిక్ తప్పుకున్న నేపథ్యంలో సమీకరణాలు మారుతున్నాయని సమాచారం.
విశ్వసనీయ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం పెద్ది జూన్ 4 విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. పిల్లల సెలవులు, హాలిడే సీజన్, ఐపీఎల్ క్రికెట్ మే నెలాఖరుకే అయిపోవడం, చెప్పుకోదగ్గ హాలీవుడ్ బాలీవుడ్ రిలీజులు లేకపోవడం లాంటివన్నీ బేరీజు వేసుకున్నారట. జూన్ 4 అయితేనే అన్ని విధాలా రెవిన్యూ మేకర్ అవుతుందని భావించి ఆ మేరకు డిస్ట్రిబ్యూటర్ల అభిప్రాయాలు సేకరిస్తున్నారని తెలిసింది. అత్యధిక శాతం బయ్యర్లు చాలా సానుకూలంగా ఉన్నారట.
సో జూన్ 4 పెద్ది రావడం లాంఛనమే. ఎలాగూ ఐటెం సాంగ్ ఈ వారాంతంలో అయిపోతుంది. ప్యాచ్ వర్కులకు పెద్దగా టెన్షన్ అక్కర్లేదు. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది. సెకండాఫ్ కూడా వేగవంతం చేసి ఏఆర్ రెహమాన్ కు ఇచ్చేస్తే రీ రికార్డింగ్ కు తగినంత సమయం ఉంటుంది. ఒకవేళ ఇదే ఫిక్స్ అయ్యే పక్షంలో పెద్ది చేతిలో 35 రోజుల టైం ఉంటుంది. ప్రమోషన్ల విషయంలో కాళ్లకు చక్రాలు కట్టుకుని పరుగులు పెట్టాల్సి ఉంటుంది.
ప్రకటన కూడా సిద్ధమయ్యిందట కానీ నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించి అనౌన్స్ మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే రెండు డేట్లు మారిపోయిన నేపథ్యంలో మరోసారి రిపీట్ చేస్తే బజ్ ప్రమాదంలో పడుతుంది. పుష్ప 2 రేంజ్ లో రేట్లు పలుకుతున్నప్పటికీ పెద్దిని కొనేందుకు పెద్ద ఎత్తున బయ్యర్లు రెడీగా ఉన్నారు. ఏరియాల వారిగా ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యారు. మిగిలిన ఒకటి రెండు ఈ వారంలోగా పూర్తి చేసి పబ్లిసిటీ స్పీడప్ చేస్తారు. మరి జూన్ 4 అవుతుందో లేదా 25కే నిలబడుతుందో వెయిట్ అండ్ సీ.
This post was last modified on April 29, 2026 8:56 pm
ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…
జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…
ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…
జాతీయ గేయం వందేమాతరం వ్యవహారంపై జరుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…