Political News

జీవన్ రెడ్డిపై కేసీఆర్ వరాల జల్లు!

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో 40 ఏళ్ల బంధాన్ని వీడి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి జీవన్ రెడ్డికి మలి దశ ఓ రేంజిలో ఉంటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి.. సోమవారం తన సొంతూరు జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా జీవన్ రెడ్డికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి భవిష్యత్తు ఎలా ఉంటుందన్న దానిపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. జీవన్ రెడ్డి చేరిక కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదిక మీద నుంచే కేసీఆర ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గురించి, జీవన్ రెడ్డికి పార్టీ అప్పగించే బాధ్యతల గురించి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి వచ్చిన జీవన్ రెడ్డిని ఆయన సొంత జిల్లా జగిత్యాల, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే పరిమితం చేయబోమని కేసీఆర్ అన్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆయన సేవలను వినియోగించుకుంటామని కూడా కేసీఆర్ ప్రకటించారు.

పార్టీలో జీవన్ రెడ్డికి ప్రాధాన్యతతోనే సరిపెట్టని కేసీఆర్.. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే… బీఆర్ఎస్ కేబినెట్ లో జీవన్ రెడ్డికి కీలక పదవులు అప్పగిస్తామని ప్రకటించారు. కేబినెట్ లో కీలక శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి పనిచేయబోతున్నారని ఆయన చెప్పినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది.

జీవన్ రెడ్డి అనుభవాన్ని అటు పార్టీతో పాటుగా ప్రభుత్వ పరంగానూ వినియోగించుకోవడానికి తమ వద్ద ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. జీవన్ రెడ్డి రూపంలో జగిత్యాల జిల్లా ప్రజలు ఓ మంచి నేత నుంచి మంచి పాలనను చూస్తారని కేసీఆర్ అన్నారు. మొత్తంగా జీవన్ రెడ్డికి పార్టీలో ఎనలేని ప్రాధాన్యం దక్కిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

This post was last modified on April 20, 2026 10:15 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

31 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago