Movie News

క్లాసిక్ దర్శకుడికి భలే అవకాశం

ఒక డిజాస్టర్ పడితే చాలు దర్శకుడి ట్రాక్ రికార్డు గతంలో ఎంత ఉందనేది నిర్మాతలు పట్టించుకోరు. అందులోనూ వెటరన్ డైరెక్టర్స్ అయితే రిస్క్ ఎక్కువని భయపడతారు. అందుకే వివి వినాయక్, భీమినేని శ్రీనివాసరావు లాంటి సీనియర్లు త్వరగా మెగా ఫోన్ కు గుడ్ బై చెప్పేశారు. పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు ఇంకా పోరాడుతున్నారు. ఈ లిస్టులో కరుణాకరన్ చేరబోతున్నారు. ‘తొలిప్రేమ’ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈయనది ఒకప్పడు టాప్ డిమాండ్.

సుమంత్ ‘యువకుడు’ ఫెయిలైనా టేకింగ్ కు ప్రశంసలు వచ్చాయి. వెంకటేష్ ‘వాసు’ని ఇప్పుడు పొగిడేవాళ్లు కనిపిస్తారు కానీ అప్పట్లో అది పెద్ద ఫ్లాప్. పవన్ కళ్యాణ్ రెండోసారి కలయిక కోసం ‘బాలు ఏబిసిడిఏఎఫ్’ చేస్తే అది ఊహించనంత సూపర్ ఫ్లాప్ గా నిలిచింది. అల్లు అర్జున్ తో ‘హ్యాపీ’ చేస్తే పనవ్వలేదు. కొత్తవాళ్లతో తీసిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ ఒకటే కొంచెం ఊరట కలిగించింది. అది కూడా చెప్పుకోదగ్గ డీసెంట్ హిట్ అనిపించుకుంది.

ప్రభాస్ ‘డార్లింగ్’ మరో పెద్ద ప్రమోషన్ గా మర్చిపోలేని విజయాన్ని అందుకుంది. రామ్ ‘ఎందుకంటే ప్రేమంటా’, నితిన్ ‘చిన్నదానా నీ కోసం’ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి. 2018 ‘తేజ్ ఐ లవ్ యు’ డిజాస్టర్ తర్వాత కరుణాకరన్ మళ్ళీ కనిపించలేదు. తిరిగి ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ వచ్చారు. బెల్లంకొండ గణేష్ హీరోగా రూపొందే ఎంటర్ టైనర్ ఈయనే తీస్తున్నారు. కెవి అనుదీప్ సంభాషణలు రాయడం గమనార్హం.

కొత్త కథలతో తిరుగుతున్న డెబ్యూ డైరెక్టర్లకు అవకాశాలు దొరకడం కష్టమవుతున్న టైంలో కరుణాకరన్ కు మరో ప్రాజెక్టు రావడం విశేషమే. అయితే నిర్మాతల కోణంలో చూస్తే అనుభవలేమి వల్ల కొత్త దర్శకులు చెప్పిన కథలను సరిగ్గా తెరకెక్కించలేకపోతున్నారు. దీని వల్ల ఫ్లాపుల శాతం పెరిగిపోతోంది. కొత్త డాక్టర్ కన్నా ఎక్స్ పీరియన్స్ ఉన్న పాత పేషెంట్ నయమన్న తరహాలో సీనియర్లకు ఓటు వేస్తున్న ప్రొడ్యూసర్లు లేకపోలేదు. తేజ్ ఐ లవ్ యు చేసిన గాయాన్ని కరుణాకరన్ దీంతో పోగొట్టాలి.

This post was last modified on April 20, 2026 10:05 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

43 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

5 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago