నాని ప్యారడైజ్ మీద అంచనాల గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 21 విడుదల కోసం అభిమానులే కాదు మూవీ లవర్స్ కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నాని ఇప్పటిదాకా చేసిన సినిమాలకు భిన్నంగా ఓవర్ వయొలెంట్ సబ్జెక్టు ఎంచుకోవడమే కాకుండా క్యారెక్టరైజేషన్ తో ప్రేక్షకులను షాక్ కు గురి చేయబోతున్నాడన్న వార్త ఇప్పటికే సెన్సేషన్ సృష్టించింది. ఇక కౌంట్ డౌన్ లో ఉన్నది 122 రోజులు మాత్రమే.
సోమవారానికి 95 వర్కింగ్ డేస్ పూర్తి చేసుకున్న ప్యారడైజ్ కి ఇంకో 40 రోజులు కావాలట. అంటే బ్యాలన్స్ 80 డేస్ చేతిలో ఉంటాయి. పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్, టీజర్ ట్రైలర్ లాంచులు, ఇండియా వైడ్ ప్రమోషన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, మీడియా ఇంటర్వ్యూలు, మ్యూజికల్ నైట్లు వగైరాలన్నీ ఇందులోనే జరిగిపోవాలి. అది కూడా మధ్యలో ఎలాంటి అవాంతరాలు రాకుండా అన్ని అనుకున్న టైం ప్రకారం ఒక్క రోజు ఆలస్యం లేకుండా జరిగితేనే సుమా.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మీద చాలా ఒత్తిడి అయితే ఉండబోతోంది. ఎందుకంటే చూసేందుకు 122 పెద్ద నెంబర్ లాగా కనిపిస్తున్నా రోజులు మెట్రో స్పీడ్ కంటే వేగంగా పరిగెత్తుతున్నాయి. అందులోనూ ప్యాన్ ఇండియా మూవీ కావడంతో కేవలం తెలుగు వెర్షన్ పనులు ఒకటే చూసుకుంటే సరిపోదు. అన్ని వ్యవహారాలు దగ్గరుండి పర్యవేక్షించాలి. ఇప్పటికే బడ్జెట్ భారీగా అయ్యింది. రికవరీ కావాలంటే బిజినెస్ వంద కోట్లకు తగ్గకుండా థియేటర్ నుంచే రావాలి.
ముందైతే ట్రైలర్ సిద్ధం చేసుకోవాలి. హైప్ పెరిగేందుకు ఇది చాలా కీలకం కానుంది. నాని ఎంత కష్టపడి ప్రమోషన్లు చేసినా దసరా, సరిపోదా శనివారం, హిట్ 3 సినిమాలు హిందీలో ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. కానీ ప్యారడైజ్ కు అలా జరగకూడదనే స్కేల్ దగ్గరి నుంచి క్యాస్టింగ్ వరకు అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకున్నారు. రెండో విలన్ గా రాఘవ్ జుయేల్ ని ఎంచుకోవడం అందులో భాగమే. ఆయా షేర్ సాంగ్ ఛార్ట్ బస్టర్ కావడంతో అందరి దృష్టి నెక్స్ట్ పాట మీద ఉంది.
This post was last modified on April 20, 2026 10:29 pm
వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు.. జీఎస్టీ…
భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఆయన కు వినతి…
అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…
బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…
విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…