Political News

కీలక బిల్లులపై బీఆర్ఎస్ వైఖరేంటే…?

జాతీయ స్తాయిలో ఇప్పుడు రెండు కీలక అంశాలపై ఎడతెగని చర్చ నడుస్తోంది. ఈ బిల్లుల విషయంలో అధికార ఎన్డీఏతో పాటు విపక్ష ఇండియా కూటమి తమదైన చర్చలను సాగిస్తున్నాయి. ఇక ఈ రెండు కూటములలో లేని తెలంగాణ విపక్ష పార్టీ బీఆర్ఎస్ తన వైఖరిపై తాజాగా ఓ నిర్ణయానికి వచ్చింది.

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లకు ఉద్దేశించిన నారీ శక్తి వందనం బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్… నియోజకవర్గాల పునర్విభజనపై మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడిపోయింది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అంటూ చెబుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్… దక్షిణాదికి న్యాయం జరిగితేనే ఆ బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు.

అయినా ఇప్పుడు బీఆర్ఎస్ కు లోక్ సభలో సింగిల్ సీటు కూడా లేదు. ఇక రాజ్యసభలో నాలుగు స్థానాలు బీఆర్ఎస్ కు ఉన్నాయి. అంటే..లోక్ సభలో బిల్లులను ప్రవేశఫెట్టినప్పుడు బీఆర్ఎస్ కు కనీసం స్పందించేందుకూ అవకాశం లేదన్న మాట.

ఇక లోక్ సభ ఆమోదం తర్వాత రాజ్యసభకు వచ్చే ఆ బిల్లులను బీఆర్ఎస్ అడ్డుకోవాలనుకున్నా… కుదిరే పరిస్థితి లేదనే చెప్పాలి. ఎందుకంటే… ఆ పార్టీకి రాజ్యసభలో ఉన్నది నలుగురు సభ్యులే.

ఈ బిల్లులకు సంబంధించి అడ్డుకునే, ముందుకు సాగించే పరిస్థితి ఎంతమాత్రం లేకున్నా,… ఓ రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ఈ బిల్లులపై స్పందించాలి కదా. అందులో భాగంగానే పార్టీ అధినేత హోదాలో కేసీఆర్… బుధవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరో ముఖ్య నేత హరీశ్ రావులతో భేటీ అయ్యారు. బిల్లులపై చర్చించారు. ఈ సందర్భంగా మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపేలా రాజ్యసభ సభ్యులకు దిశానిర్దేశం చేయాలని ఆయన వారిద్దరికీ సూచించారు.

ఇక డీలిమిటేషన్ బిల్లుపై మాత్రం కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం లోక్ సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం మేర సీట్లున్నాయి. ఇప్పుడు డీలిమిటేసన్ తర్వాత కూడా అంతే స్థాయిలో సీట్లు… అంటే డీలిమిటేషన్ జరిగిన తర్వాత కూడా మొత్తం సీట్లలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం సీట్లు ఉండేలా చూడాలన్నది కేసీఆర్ భావనగా తెలుస్తోంది. అలా కాని పక్షంలో దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పిన కేసీఆర్…రాజ్యసభలో ఆ బిల్లును వ్యతిరేకించాలని, ఇతర పార్టీల మద్దతు కూడా కూడగట్టాలని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

This post was last modified on April 15, 2026 11:12 am

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

7 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

7 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

7 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

7 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

9 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

9 hours ago