స్టాండప్ కామెడీ షోల్లో ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించలేక.. సెలబ్రెటీల వ్యక్తిగత విషయాల మీద కామెంట్లు చేసి జనాలను నవ్వించాలని చూడడం కామన్ అయిపోయింది. ఈ క్రమంలో కొందరు హద్దులు దాటిపోతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, కొణిదెల నిహారికల పేర్లు వాడుతూ ఒక కామెడీ షోలో అనుదీప్ కటికల అనే స్టాండప్ కమెడియన్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
ఆ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవడం.. మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో స్పందించడం.. ఈ వ్యవహారం పెద్ద వివాదంగా మారడం విదితమే. సోషల్ మీడియా ట్రోల్స్‌తో సరిపెట్టకుండా.. అనుదీప్ కోసం అతను షోలు చేసే ప్రదేశానికి కూడా వెళ్లి మెగా ఫ్యాన్స్ తమ ఆగ్రహాన్ని చూపించారు. తర్వాత ఆ కమెడియన్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. అంతటితో ఈ వ్యవహారం ముగిసిపోయింది అనుకున్నారంతా. కానీ అనుదీప్‌కు అసలు కష్టం ఇప్పుడు మొదైలంది.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు తాజాగా అనుదీప్ కటికలను అరెస్ట్ చేసినట్లు సమాచారం. తన వీడియో వైరల్ అయిన దగ్గర్నుంచి అనుదీప్ కామెడీ షోలు చేయట్లేదు. బయట ఎక్కడా తిరగడం లేదు. హైదరాబాద్‌లో కామెడీ షోలు చేసే అనుదీప్.. తన కుటుంబ సభ్యులను కలవడానికి ప్రయాగ్ రాజ్‌కు వెళ్లాడు. అతడి మొబైల్‌ను ట్రాక్ చేసిన ఏపీ పోలీసులు.. ప్రయాగ్ రాజ్‌కు వెళ్లి మరీ అనుదీప్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
అనుదీప్ వ్యాఖ్యల విషయమై కాకినాడకు చెందిన జనసేన నాయకుడు ఒకరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అనుదీప్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా పోలీసులకు సమర్పించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితం మీద దారుణమైన వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు.
మొబైల్ ట్రాకింగ్ ద్వారా అనుదీప్ ప్రయాగ్ రాజ్‌లో ఉన్న విషయం తెలుసుకుని, అక్కడికి వెళ్లి అతణ్ని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అనుదీప్ వెంట అతడి తండ్రి ఉన్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే ఈ కేసు అనుదీప్ తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తోంది.
This post was last modified on April 15, 2026 1:25 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…