Political News

విజ‌య్ గ్రాఫ్‌… పోలింగ్ ముందు ఎలా ఉంది?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు త‌మ‌ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. ఈ క్రమంలో కీలక రాజకీయ పక్షంగా తెరమీదకు వచ్చిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళ‌గం(టివి కే) పార్టీ పరిస్థితి ఎలా ఉంది.. పోలింగ్‌కు 10 రోజుల ముందు ప్రజల నాడి ఏ విధంగా ఉంది అనే విషయాలపై ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా విజయ్ స్టామినాపై రాజకీయంగా ప్రజల మధ్య ఏ విధమైన చర్చ నడుస్తోంది ..అనేది కూడా ఆసక్తిగా మారింది.

నామినేషన్ కు ముందు విజయ్ సారథ్యంలోని టీ వీ కే పార్టీపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఓట్ల చీలిక ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను తనదైన శైలిలో మళ్ళించుకుని ఎన్నికల్లో గేమ్ చేంజ‌ర్‌గా మారాలని విజయ్ భావించారు. అందుకే అనేక పార్టీలు ఆయన వెంటపడి మరీ పొత్తుల కోసం ప్రయత్నం చేసినప్పటికీ విజయ్ మాత్రం స్పందించలేదు. తాను ఒంటరిగానే పోటీ చేయాలని భావించినట్టు కుండబద్దలు పుట్టారు. 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగింది.

ప్రచారం కొన్ని జిల్లాల్లో జోరుగా సాగగా మరికొన్ని జిల్లాలో సాధారణ స్థాయిలోనే జరుగుతోంది. ఇంకా 10 రోజుల సమయం ఉంది కాబట్టి అన్ని జిల్లాల్లో కవర్ చేయగలుగుతారా లేదా అనేది చూడాలి. అయితే ప్రధానంగా ఇప్పుడు చర్చకు వస్తున్న కీలక అంశం పొలిటికల్‌గా విజయ్ గ్రాఫ్ ఎలా ఉంది అనేది. రాజకీయంగా నాయకులు వేసే అడుగులు అత్యంత కీలకం. ఒకసారి ఒక మాట ఇచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు విజయ్ విషయంలో ఇదే అంశం పెద్ద ఎత్తున వివాదంగా మారుతోంది.

ఒకవైపు ఎన్నికల సమయంలో ఆయన అనేక హామీలు గుర్తించారు. ఉచిత పథకాలను కూడా ప్రకటించారు. కానీ తాజా ఎన్నికల ప్రచారంలో డిఎంకె ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాష్ట్రాన్ని అప్పుల‌ పాలు చేశారంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనికి కొనసాగింపుగా ఇవన్నీ ఉచితల వల్లే జరిగాయని చెప్పుకొచ్చారు. కానీ ఎన్నికలవేళ ఆయన కూడా ఉచితలే ప్రకటించారు. ఎన్నికల హామీల్లోనూ ఉచితాలు అనేకం ఉన్నాయి. ఈ వ్యవహారం ఇతర రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారింది.

ఫలితంగా.. విజయ్ ఆలోచనా శైలిపట్ల విమర్శలు తలెత్తాయి. ఈ విషయాన్ని కార్నర్ చేస్తూ సీనియర్ రాజకీయ విశ్లేషకులు.. నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఓట్ల చీలిక అంశాన్ని గమనిస్తే డిఎంకె ప్రభుత్వం పై వ్యతిరేకత ఉంటుందని భావించినప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వాతావరణం ప్రధానంగా బిజెపి వేస్తున్న ఎత్తులు వంటివి గమనించిన తర్వాత ఈ చీలిక ఓట్ల ప్రభావం పెద్దగా ఉండదనేది తాజాగా వెల్ల‌డైన పలు సర్వేల్లో స్పష్టమైంది.

అన్నాడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో దీనిని ప్రధానంగా డీఎంకే టార్గెట్ చేసింది. మతప‌ర‌మైన‌ శక్తులతో రాష్ట్రాన్ని కలుషితం చేయాలని అన్నాడీఎంకే ప్రయత్నిస్తోంది అంటూ డిఎంకె చేస్తున్న ప్రచారం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి బిజెపిపై తమిళనాడు ప్రజలు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు. హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారన్న వాదన ఒకటైతే వైద్య విద్య కోర్సులకు సంబంధించి నిర్వహించే ప్రవేశ పరీక్ష నీట్ విషయంలో స్థానిక భాషలకు అవకాశం కల్పించాలన్న డిమాండ్ మ‌రొక‌టి.

ఈ విషయంలో కూడా బిజెపిపై త‌మిళులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ప‌న్నుల విష‌యంలో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించే అంశంపై రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్న ముఖ్యమంత్రి స్టాలిన్ వాదన కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఫలితంగా వ్యతిరేక ఓటు తగ్గి అనుకూల ఓటు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది అంతిమంగా విజయ్ పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించేలా లేదన్నది విశ్లేషకుల మాట. ఇక, బిజెపిని రాజకీయ పార్టీగా తమిళ ప్రజలు గుర్తించినప్పటికీ అధికారంలోకి తీసుకువచ్చే క్రమంలోనూ అదేవిధంగా స్థానికంగా అధికారాన్ని కట్టబెట్టే విషయంలో వారికి భిన్నాభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయి.

ఇది కూడా ఓటు బ్యాంకును చీల్చ‌కుండా స్థిరంగా ఉంచుతుందని డిఎంకె అంచనా వేస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు మారుతున్న ఓటు బ్యాంకు పరిణామాలు విజయ్ గ్రాఫ్ ను తల్లడిల్లేలా చేస్తున్నాయి. అంతేకాదు పోలింగ్‌కు ముందు ఎలాంటి పరిణామాలు అయినా జరిగే అవకాశం ఉందన్న చర్చ కూడా నడుస్తోంది. చివరికి ఏం జరుగుతుందనేది చూడాలి.

This post was last modified on April 13, 2026 10:51 am

Share

Recent Posts

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

4 hours ago

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

5 hours ago

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…

6 hours ago

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

7 hours ago

ఒత్తిడి బండి మీద ‘రణబాలి’ ప్రయాణం

ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…

7 hours ago

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

8 hours ago