ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి యుద్ధం చేస్తున్న అమెరికా.. రెండు వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలకు అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ సహా ఇరాన్ ప్రతినిధి బృందం హాజరైంది. అయితే.. ఈ చర్చలు ఫలించలేదు. ఇరాన్ షరతులకు తాము అంగీకరించేది.. అమెరికా షరతులకు తాము తలొగ్గేది లేదని ఇరాన్ స్పష్టం చేశాయి.
ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన సోషల్ సామాజిక మాధ్య మం వేదికగా.. సంచలన ప్రకటన చేశారు. గతంలో వెనుజువెలా అధ్యక్షుడు మదురోను అరెస్టు చేయడానికి ముందు.. ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలన్న సంకల్పంతో ప్రయోగించిన అస్త్రం తాలూకు మీడియా వార్తలను ఆయన పంచుకున్నారు. ఆనాడు.. వెనుజువెలాకు రవాణా అవుతున్న చమురు నౌకలను సముద్రంలో దిగ్బంధించారు. దీంతో వెనుజువెలా రెండు మాసాల పాటు.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.
ఇప్పుడు ఇరాన్‌కు కూడా ఇదే గతి(ది…సేమ్ సిట్యుయేషన్) పడుతుందని అర్ధం వచ్చేలా ట్రంప్ పోస్టు చేశారు. అంటే.. ఇరాన్ ప్రధాన ఆదాయ వనరు అయిన.. చమురు నౌకలను అంగుళం కూడా ముందుకు కదలకుండా అడ్డుకునే అస్త్రాన్ని ట్రంప్ ప్రయోగించనున్నారు.
తద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ఆయన ప్రభావితం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు .. ఇరాన్‌కు ఆయుధాలు ఇచ్చే దేశాలను తాజాగా మరోసారి నేరుగా ట్రంప్ హెచ్చరించారు. రష్యా సహా చైనాలు ఇరాన్‌కు సాయం చేస్తున్నాయని.. ఆయా దేశాలపై 200 శాతం సుంకాలు విధిస్తానని తేల్చి చెప్పారు.
భారత్‌కు సంకటం..
ఇరాన్‌కు మిత్ర దేశంగా ఉన్న భారత్.. ఇంత సందిగ్ధతలో కూడా.. చమురు నౌకలు తెచ్చుకుంటోంది. కానీ.. నేరుగా ఇరాన్‌పైనే అమెరికా ఉక్కుపాదం మోపితే.. ఇక, ఇరాన్ చౌమురు నౌకల నుంచి ఇంధనం కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు.
ఇది.. వారాలు.. నెలల తరబడి కొనసాగే అవకాశం ఉంది. వెనుజువెలాను హెచ్చరించేందుకు రెండు నెలల పాటు ఆ దేశ చమురు నౌకలను దిగ్బంధించారు. ఇప్పుడు ఇరాన్‌ను దిగ్బంధించేందుకు కనీసంలో కనీసం రెండు నెలలైనా పడుతుందని అంచనా ఉన్నాయి. ఇదే జరిగితే భారత్‌కు ఇంధనం, గ్యాస్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురు కానున్నాయి. ధరలు పెరిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
This post was last modified on April 14, 2026 9:34 am
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం మాట ఎలా ఉన్నా.. నాయకులను బలోపేతం చేసేందుకు.. వారిని కొంత ఉత్తేజ పరిచేందుకు…