అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే మల్టీస్టారర్ కు ముందు లోకేష్ కనగరాజ్ ని దర్శకుడిగా అనుకున్నారు. తీరా చూస్తే కొన్నిరోజుల తర్వాత కూలి ఫలితం వచ్చాక ఆ ప్రాజెక్టు గురించి కొత్త ట్విస్టు జరిగింది. అటు ఇటు తిరిగి ఏవేవో పేర్లు వినిపించాక ఏవేవో చర్చలు జరిగాక చివరికి ఆ ఛాన్స్ జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ కు దక్కింది.
ఇది కాకుండా కమల్ బ్యానర్ లోనే రజని సోలో హీరోగా మరో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తలైవర్ 173 వర్కింగ్ టైటిల్ తో ఆ మధ్య అధికారిక ప్రకటన ఇచ్చారు. ముందు సుందర్ సి చేరారు. కానీ ఆయన హఠాత్తుగా తప్పుకున్నారు. తర్వాత శివ కార్తికేయన్ కు కాలేజీ డాన్ లాంటి హిట్ ఇచ్చిన శిబి చక్రవర్తి పేరుని లాక్ చేశారు. కానీ ఇప్పుడు అతని స్థానంలో అశ్వత్ మారిముత్తు రానున్నారని కొత్త టాక్ వినిపిస్తోంది. ఖచ్చితమైన సమాచారం లేదు కానీ అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలు దాన్నే సూచిస్తున్నాయని వినికిడి.
కోలీవుడ్ వర్గాలు ఇంకో కొత్త వెర్షన్ చెబుతున్నాయి. గతంలో శిబి చక్రవర్తి నానితో ఒక మూవీ చేయాలని హీరో, నిర్మాణ సంస్థని ఒప్పించి హైదరాబాద్ లో ఆఫీస్ తీశారు. కొన్ని నెలల తర్వాత అది ఆగిపోయింది. కానీ ఆలోగానే ప్రీ ప్రొడక్షన్ ఖర్చు అయిదు కోట్లకు చేరుకుందట. దాన్ని వెనక్కు ఇమ్మని సదరు నిర్మాతలు డిమాండ్ చేయడంతో ఫైనల్ గా కోటిన్నర ఇచ్చే విధంగా శిబి సెటిల్ మెంట్ చేసుకున్నాడని అంటున్నారు. ఈ గాసిప్ నిజానిజాలు పెరుమాళ్ళకెరుక.
లాల్ సలామ్, కూలీ ఫెయిలయ్యాక రజని కొంచెం స్లో అయ్యారు. జైలర్ 2 కూడా పరుగులు పెట్టడం లేదు. క్యామియోలకు సరైన స్టార్ హీరోలు దొరక్క కొంత ఆలస్యమవుతోంది. ఏడు పదుల వయసు దాటిపోయిన నేపథ్యంలో ఇకపై చేయబోయే సినిమాల విషయంలో రజని చాలా కఠినంగా ఉంటున్నారట. స్క్రిప్ట్ ఏ దశలో నచ్చకపోయినా సారీ చెప్పేసి పంపిస్తున్నారట. అందులో భాగంనే ఇన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఫైనల్ గా ఎవరుంటారో వెయిట్ అండ్ సీ.
This post was last modified on April 13, 2026 11:51 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…