Political News

మావిగన్ లాగా.. అవి గొడ్డలి పెడతారా? : షర్మిల

వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్‌పై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని విషయంలో ప్లాన్ బీ ప్రకారం మావిగన్ (మచిలీపట్నం + విజయవాడ + గుంటూరు) అంటున్న నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గానికి కూడా పేరు పెడతారా? అని ప్రశ్నించారు. దీనికి అవి గొడ్డలి అని పేరు పెడితే అందరూ సంతోషిస్తారని వ్యాఖ్యానించారు.

పులివెందులకు కూడా పేరు పెడతారా? అవినాష్ గొడ్డలి.. అవి గొడ్డలి అని మారుస్తారా? అని ప్రశ్నించారు.

ఇద్దరి పేర్లూ.. సరిపోతాయి!

జగన్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి పై ఈ సందర్భంగా షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పేరులో గన్ ఉందని, అవినాష్ పేరులో వినాశనం ఉందని, ఇద్దరి పేర్లూ సరిపోతాయని వ్యాఖ్యానించారు.

‘ఎంతసేపూ నరకాలి.. చంపాలి.. నాశనం చేయాలి’ ఇదే వైసీపీ సిద్ధాంతమని అన్నారు. ఎంతసేపూ గన్‌లు గొడ్డళ్లేనా? అని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో రాజధాని అమరావతికి ఒక్క ఇటుక కూడా పెట్టలేదని విమర్శించారు.

అమరావతికి బదులు మావిగన్ పేరు బాగుందంటున్న వైసీపీ అధినేత జగన్.. పులివెందులకు బదులు అవి గొడ్డలి పేరు పెడతారా? అని షర్మిల వ్యాఖ్యానించారు. మావిగన్ బాగుందని చెబుతున్న జగన్ ఐదేళ్లు ఏం చేశారో ప్రశ్నించారు. అలాంటప్పుడు మూడు రాజధానులను ఎందుకు తెరమీదికి తెచ్చారని అన్నారు. ఈ విషయంలో నవ్వు తప్ప తమకు ఏమీ రావడం లేదని ఎద్దేవా చేశారు.

బొత్స ఏడ్చింది తక్కువే!

వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అనంతరం జరిగిన పరిణామాలపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కామెంట్లపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కన్నీరు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై షర్మిల స్పందిస్తూ, విజయమ్మకు జరిగిన అవమానం ముందు ఈ కన్నీరు తక్కువేనన్నారు.

నిండు సభలో విజయమ్మను అవమానించిన బొత్స ఎంత ఏడ్చినా తక్కువే అని వ్యాఖ్యానించారు.

వైఎస్ పేరు నాకే సొంతం!

వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును వాడుకునే హక్కు, ఆయన వారసురాలిగా రాజకీయాలు చేసే హక్కు కూడా తనకే ఉందని షర్మిల వ్యాఖ్యానించారు. తాను కూటమికి అమ్ముడు పోయానని చెబుతున్న వైసీపీ నాయకులు బీజేపీకి జగన్ ఎందుకు అమ్ముడు పోయాడో చెప్పాలని ప్రశ్నించారు. మోడీతో అక్రమంగా పొత్తు ఎందుకు పెట్టుకున్నాడో చెప్పాలన్నారు.

తన జీవితాంతం బీజేపీని వ్యతిరేకించి వైఎస్ పేరును తలుచుకునే హక్కు, ఆయన పేరును వాడుకునే హక్కు కూడా వైసీపీకి లేదన్నారు.

This post was last modified on April 10, 2026 11:39 pm

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

1 hour ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

1 hour ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

1 hour ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

2 hours ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

5 hours ago

అంతా బానే ఉన్నట్టుగా వైసీపీ ప్రచారం

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం మాట ఎలా ఉన్నా.. నాయ‌కుల‌ను బ‌లోపేతం చేసేందుకు.. వారిని కొంత ఉత్తేజ ప‌రిచేందుకు…

5 hours ago