Movie News

ఛాన్స్ పోగొట్టిన లవ్ ఇన్సూరెన్స్

ప్రదీప్ రంగనాథన్ కొత్త మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు థియేటర్లలో అడుగు పెట్టేసింది. ఉదయం చాలా చోట్ల కెడిఎం ఇష్యూ రావడంతో షోలు పడలేదు కానీ తర్వాత సాల్వ్ అయిపోయింది. బుకింగ్స్ ఓ మోస్తరుగా పర్వాలేదనిపించేలా జరిగాయి కానీ డ్రాగన్, డ్యూడ్ తో పోలిస్తే వాటికి వచ్చిన క్రేజ్ స్థాయిలో ఈ ఎల్ఐకె లేదనేది స్పష్టం. అందులోనూ డెకాయిట్ రూపంలో పెద్ద కాంపిటీషన్ ఉండటం ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించింది.

ఇక టాక్ విషయానికి వస్తే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి యునానిమస్ టాక్ రాలేదు. సోషల్ మీడియా, పబ్లిక్ టాక్స్, రివ్యూస్ గమనిస్తే నెగటివ్ నుంచి యావరేజ్ కు మధ్యలో కనిపిస్తున్నాయి. 2040 సంవత్సరాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని యూత్ ఫుల్ గా ఏదో చెప్పాలని ట్రై చేసిన దర్శకుడు విగ్నేష్ శివన్ టెక్నాలజీ, ప్రేమకు ముడిపెడుతూ డిఫరెంట్ గా రాసుకున్నాడు కానీ దాన్ని అంతే ప్రతిభావంతంగా తీర్చిదిద్దలేకపోయాడు. ముఖ్యంగా సెకండాఫ్ మీద కంప్లైంట్స్ ఎక్కువున్నాయి.

క్రమంగా ప్రదీప్ రంగనాథన్ లవ్ స్టోరీస్ పేరుతో రెగ్యులర్ మూసలోకి వెళ్తున్నట్టు కనిపిస్తోంది. పదే పదే ఒకే తరహా పాత్రలు చేయడం వల్ల రెగ్యులర్ ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరమయ్యే ప్రమాదం ఉంది. పైగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో యూత్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ అవి సరైన మోతాదులో బ్యాలన్స్ కాకపోవడంతో అధిక శాతం సినిమా బోర్ కొట్టేసేలా సాగింది. వీకెండ్ వరకు పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందనే దాని మీద ట్రేడ్ వర్గాల్లో అనుమానాలు లేకపోలేదు.

ఒకవేళ ఈ మిక్స్డ్ టాక్ తట్టుకుని తమిళం లేదా తెలుగులో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓకే హిట్ అనిపించుకున్న చాలు ప్రదీప్ రంగనాథన్ ఇమేజ్ దానికి కారణంగా నిలుస్తుంది. కాకపోతే అక్కడేమో ఎన్నికల వేడిలో జనాలు థియేటర్ల వైపు అంతగా ఆసక్తి చూపించడం లేదు. మన దగ్గరేమో బజ్ చాలా తక్కువగా ఉంది. డ్యూడ్, డ్రాగన్ హిట్ల ప్రభావం దీని మీద అంతగా కనిపించడం లేదు. చూస్తుంటే ప్రదీప్ రంగనాథన్ జోరుకి బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది.

This post was last modified on April 10, 2026 11:38 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

7 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

9 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

9 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

10 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

11 hours ago