Political News

రాజ్యసభ ఆఫర్ ను జీవన్ రెడ్డి వదిలేశారా…?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరూ జీవన్ రెడ్డి పార్టీ మార్పుపైనే దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీతో 40 ఏళ్ల తన అనుబంధాన్ని తెంచేసుకున్న జీవన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ లో చేరిపోతున్నారు. ఈ దిశగా ఆయన ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రెసిడెంట్ కేసీఆర్ లతో భేటీ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి… త్వరలోనే బీఆర్ఎస్ లో అధికారికంగా చేరబోతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగేలా సీఎం రేవంత్ రెడ్డి శతధా యత్నించారట. అందులో భాగంగా ఏకంగా రాజ్యసభ సభ్యత్వాన్ని జీవన్ కు ఇప్పించే దిశగా రేవంత్ పావులు కదిపారట. అయితే ఈ విషయం తెలుసో, తెలియదో గానీ.. జీవన్ రెడ్డి ఆ ఆఫర్ ను వదిలేశారని చెప్పాలి.

శుక్రవారం ఎర్రవలి ఫామ్ హౌస్ కు వచ్చిన జీవన్ రెడ్డి… కేసీఆర్ తో భేటీ అయ్యారు. దాదాపుగా 3 గంటలకు పైగా కేసీఆర్, జీవన్ రెడ్డిల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో జీవన్ కు కేసీఆర్ ఏం ఆఫర్ చేశారో తెలియదు గానీ… బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డికి మంచి ప్రాధాన్యత అయితే దక్కడం ఖాయమన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ తరఫున విజయం సాధించి…కాంగ్రెస్ గూటికి చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్… జీవన్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ గురించి ప్రస్తావించారు.

శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో భర్తీ కానున్న రాజ్యసభ స్థానాల్లో ఓ స్థానాన్ని జీవన్ రెడ్డికి ఇప్పించే దిశగా రేవంత్ కాంగ్రెస్అధిష్ఠానంతో అప్పటికే మొదలుపెట్టారని దానం తెలిపారు.

సీఎంతో ముఖ్య నేతల భేటీ సందర్భంగా రేవంతే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారని ఆయన అన్నారు. పార్టీ అధిష్ఠానం వద్ద రేవంత్ పలుకుబడి నేపథ్యంలో జీవన్ రెడ్డికి రాజ్యసభ సీటు తప్పనిసరిగా దక్కేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయం తెలుసో, తెలియదో గానీ… జీవన్ రెడ్డి రాజ్యసభ ఛాన్స్ వంటి మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారని దానం అన్నారు.

This post was last modified on April 11, 2026 7:56 am

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

8 minutes ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

58 minutes ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

3 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

3 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

3 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago