పాలిటిక్స్ లోకి వచ్చాకే బీపీ షుగర్: రోజా

రాజకీయ నాయకులు సవాలక్ష పనులతో బిజీబిజీగా ఉంటారు. అనేక ఒత్తిళ్లు, తీరిక లేని షెడ్యూళ్లు..వెరసి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అనేది చాలామంది రాజకీయ నాయకులకు కుదరని పని. ఆ క్రమంలోనే చాలామంది నేతలు బీపీ, షుగర్ ఎట్సెట్రాలతో ఇబ్బందిపడుతుంటారు. తాను కూడా ఆ కోవలోకే వస్తానని వైసీపీ మహిళా ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి రోజా అన్నారు.

రాజకీయాలపై రోజా తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే బీపీ, షుగర్ వచ్చాయని రోజా అన్నారు. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు లైట్ గా బీపీ స్టార్ట్ అయిందని, రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు లైట్ గా షుగర్ స్టార్ట్ అయిందని చెప్పారు.

అయితే, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కాస్త ఒత్తిడి తగ్గి కాంపెన్సేట్ అయిందని సెటైర్ వేశారు. రాజకీయాలంటేనే ఎన్నో టెన్షన్స్ ఉంటాయని, ఎంతోమందితో డీల్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రోజా చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.