Political News

ఎటు చూసినా… వైసీపీకి ఛాన్స్ లేదా బ్రో?

ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ క‌నిపించ‌డం లేదా? ఏ వ‌ర్గం కూడా వైసీపీకి ఆశించిన మేర‌కు చేరువ అయ్యే అవ‌కాశం క‌నిపించ‌డం లేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. స‌మాజంలో ప్రాత‌మికంగా.. నాలుగు వ‌ర్గాలు ఉంటాయి. పేద‌లు, సాధార‌ణ ప్ర‌జ‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి, ఉన్న‌త‌స్థాయి వ‌ర్గం. వీరిలో రాజ‌కీయాలకు.. రాజ‌కీయ నేత‌ల‌కు.. పేద‌లు, సాధార‌ణ ప్ర‌జ‌లు అత్యంత కీల‌కం. వీరిని సెంట్రిక్‌గా చేసుకునే నాయ‌కులు, పార్టీలు కూడా వ్య‌వ‌హ‌రిస్తాయి.

గ‌తంలో వైసీపీ పేద‌ల‌ను, సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను కేంద్రంగా చేసుకుని.. సంక్షేమ బాట‌ను ఎంచుకుంది. త‌ద్వారా బ‌ట‌న్ నొక్కిపేద‌ల ఖాతాల్లోకి నిధుల‌ను జ‌మ చేసింది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఫీజు రీయింబ‌ర్స్ మెంటు ప‌థ‌కాల‌ను అమలు చేసింది. జ‌గ‌న‌న్న ఇళ్ల‌ను తీసుకువ‌చ్చింది.(ఇవి పూర్తిస్థాయిలో ప్ర‌జ‌ల‌కు అంద‌లేదు) ఇక‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఆశించే ర‌హ‌దారుల నిర్మాణం.. అభివృద్ధి వంటివాటిని అట‌కెక్కించింది. ఇక‌, నాలుగో వ‌ర్గంగా ఉన్న ఉన్న‌త‌స్థాయి పారిశ్రామిక‌, సినీ రంగాల‌కు చుక్క‌లు చూపించింద‌నే వాద‌న ఉంది.

దీంతో 2024 ఎన్నిక‌ల్లో ఉన్న‌త‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తివ‌ర్గాలు పూర్తిగా వైసీపీకి వ్య‌తిరేకంగా మారాయి. ఇక‌, పేద‌లు.. సాధార‌ణ ప్ర‌జ‌లు కూట‌మి ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీలు స‌హా పింఛ‌న్ల పెంపుపై ఆశ‌లు పెట్టుకుని 20 శాతం నుంచి 30 శాతం వ‌ర‌కు చీలిపోయారు. దీంతో వైసీపీ ప‌ట్టుత‌ప్పి.. ప‌ల్టీ కొట్టింది. ఇక‌, ఇప్పుడు తిరిగి అదే పేద‌లు.. సాధార‌ణ ప్ర‌జ‌ల‌పై వైసీపీ ఆశ‌లు పెట్టుకుంది. కానీ.. ప్ర‌స్తుతం ఆ వ‌ర్గాలు కూడా దూరంగానే ఉన్న‌ట్టు ఆన్‌లైన్ స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

పేద‌లకు గ‌తంలో వైసీపీ ఇచ్చిన‌ట్టుగానే.. ప్ర‌స్తుత కూట‌మి స‌ర్కారు కూడా.. ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది. పింఛ‌న్లు పెంచ‌డంతోపాటు.. నెల నెలా 1నే వాటిని అందిస్తోంది. ఇక‌, సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌ను ఠంచ‌నుగా అమ‌లు చేస్తోంది (ఒకటి తప్ప). అలాగే.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను మురిపించేలా ర‌హ‌దారుల బాగుచేత‌తోపాటు ఉపాధి క‌ల్ప‌న‌, ఉద్యోగ క‌ల్ప‌న‌ల కోసం.. పెట్టుబ‌డుల‌ను ఆకర్షిస్తోంది. అలానే.. తాజాగా టిడ్కో ఇళ్ల‌ను ల‌క్ష‌లాది మందికి అందిస్తోంది. ఇక‌, ఉన్న‌త‌స్థాయి వ‌ర్గాల కోసం సానుకూల నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఇలా.. స‌మాజంలోని నాలుగు వ‌ర్గాల‌ను కూట‌మి సంతృప్తిప‌రుస్తోంది. త‌ద్వారా.. వైసీపీకి ఎటు చూసినా.. ఛాన్స్ క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది.

This post was last modified on April 1, 2026 9:18 am

Share

Recent Posts

అర్జున్ రెడ్డిని ఆదుకున్న మామిడి తోట‌

న‌టుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ద‌ర్శ‌కుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్ల‌ను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్ట‌ర్ అనే…

1 hour ago

ఆర్జీవీకి శివ నిర్వాణ కూలర్ బాయ్

ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…

3 hours ago

ఎట్ట‌కేల‌కు తెలుగులో తొలి హిట్టు

త‌మిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ శివ కార్తికేయ‌న్ లాగే టీవీ రంగం నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అమ్మాయి ప్రియ భ‌వానీ…

4 hours ago

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

5 hours ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

5 hours ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

5 hours ago