తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిపోరాటం చేస్తున్న తమిళ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధ్యక్షుడు, దళపతి విజయ్ రెండు స్థానాలనుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పెరుంబూరు, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఆయన పెరుంబూరు స్థానానికి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. దీనికి జోడించిన అఫిడవిట్‌లో విజయ్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఈ వివరాలను బట్టి.. 404 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులు ఉన్నాయి.
అంతేకాదు.. అదనంగా బ్యాంకు డిపాజిట్లు, ఇళ్లు, పొలాలు, స్థలాలు కూడా ఉన్నాయి. అలాగే అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయని తెలిపారు. వీటి విలువ వేల కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులకు, తనకు కలిపి కిలో బంగారం ఉందన్నారు. విదేశీ కార్ల విలువ 15 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఇక, తనకు ఎలాంటి అప్పులు లేవని విజయ్ వెల్లడించడం గమనార్హం. సహజంగా ఏ పార్టీ నాయకుడు అయినా.. అఫిడవిట్‌లో ఎంత ఆస్తి ఉందనిచెప్పినా.. దానికి కింద.. తనకు అప్పులు కూడా ఉన్నాయని పేర్కొంటారు. కానీ, విజయ్ తనకు ఎలాంటి అప్పులు లేవని చెప్పడం గమనార్హం.
ఇక, విలువైన విజయ్ ఆస్తులు ఇవీ..
+ వాహనాలు సహా చరాస్తులు: 404 కోట్ల రూపాయలు.
+ చేతిలో ఉన్న సొమ్ములు: 2 లక్షల రూపాయలు.
+ సతీమణి సంగీత దగ్గర లక్ష రూపాయలు ఉంది.
+ వివిధ బ్యాంకుల్లో ఉన్న సేవింగ్స్: 213 కోట్ల రూపాయలు
+ కుటుంబానికి కిలో బంగారం ఉంది.
+ స్థిరాస్తులు : 200 కోట్ల రూపాయలు
కార్ల విలువ 15 కోట్లు!
+ బీఎండబ్ల్యూ 530
+ బీఎండబ్ల్యూ ఐ7
+ టయోటా లెక్సస్ 350
+ టయోటా వెల్‌ఫైర్
Gulte Telugu Telugu Political and Movie News Updates