Political News

బరిలోకి విజయ్… నిర్ణయాలు కఠినమైనవే!

తమిళనాడు రాజకీయ ముఖచిత్రంలోకి మరో పార్టీ ఎంట్రీ ఇచ్చేసింది. వచ్చే నెలలో జరగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన తమిళ వెట్రిగ కగజం(టీవీకే) పార్టీ బరిలోకి దిగబోతోంది. ఈ మేరకు ఆదివారం చెన్నైలో నిర్వహించిన బహిరంగ సభలో విజయ్ తన పార్టీ తరఫున బరిలోకి దిగే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అంతేకాకుండా తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నదానిపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. అభ్యర్థుల ప్రకటనతో పాటుగా తమ పార్టీని గెలిపిస్తే ఏం చేస్తానన్న విషయాన్ని కూడా విజయ్ ప్రకటించారు. విజయ్ చేసిన ప్రకటన, ఆయన పార్టీ అభ్యర్ధుల పైనా, అందులో విజయ్ అనుసరించిన తీరుపైనా ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది.

ఎన్నికల్లో విజయ్ రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నారు. పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి తాను పోటీ చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు. వచ్చీ రావడంతోనే రెండు స్థానాల్లో విజయ్ పోటీ చేస్తున్న వైనంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో ప్రజారాజ్యం పేరిట పార్టీ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత జనసేన పేరిట పార్టీ పెట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు వచ్చీరావడంతోనే రెండు స్థానాల్లో పోటీ చేశారు. చిరు ఓ చోట ఓడిపోగా, మరో చోట విజయం సాధించారు. ఇక పవన్ అయితే పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఈ లెక్కన తొలి ప్రయత్నంలోనే రెండు స్థానాల్లో పోటీ చేయడం ఫలించకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది.

ఇక ఓ సీటును తన కారు డ్రైవర్ కుమారుడికి విజయ్ కేటాయించారు. ఈ ప్రయోగం పెద్దగా ఫలించకపోవచ్చన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఓ లారీ డ్రైవర్ కు తన పార్టీ టికెట్ ఇచ్చినా ఫలితం రాలేదు. నిన్నటిదాకా సినిమాల్లో నటించిన విజయ్… అదే సినిమాటిక్ పోకడలను వీడకుండా డ్రైవర్ కుమారుడికి సీటిచ్చానని చెప్పుకుంటూ సానుభూతి పొందే యత్నం చేస్తున్నారని సెటైర్లు వినిపిస్తున్నాయి. గెలుపు గుర్రాలను వెతకాల్సింది పోయి సానుభూతి మీదనే ఆధారపడితే… ఈ తరహా ఎంపికలే ఉంటాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

తన పార్టీకి అధికారం కట్టబెడితే తానేం చేస్తానన్న విషయాన్ని ప్రస్తావించిన విజయ్… భారీ హామీలనే ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే..ప్రజా ధనాన్ని దుర్వనియోగం చేయనని, అవినీతికి పాల్పడమని, మహిళలకు భద్రత కల్పిస్తామని ప్రకటించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తమిళనాడును మారుస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతమాత్రం వ్యతిరేకంగా వెళ్లబోమని విజయ్ హామీ ఇచ్చారు. ఇక ఈ ఎన్నికల్లో టీవీకేకు ఓటు వేసి తనకు ఒక్కసారి అధికారం ఇచ్చి చూడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇక కరూర్ లో నిర్వహించిన తన రోడ్ షోలో జరిగిన ప్రమాదం, అందులో 40 మంది చనిపోయిన వైనం విజయ్ ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు విజయ్ కి అనుమతి ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు షరతులు విధించింది. కరూర్ ఘటన తర్వాత విజయ్ అసలు బయటకే రాలేని పరిస్థితులు కొనసాగాయి.

జరిగిన ప్రమాదాన్ని టాకిల్ చేసే విషయంలోనూ విజయ్ విఫలమయ్యారన్న వాదన లేకపోలేదు. అంతేకాకుండా తన సినీ గ్లామర్ ను వినియోగించుకుని ఎన్నికల్లో విజయం సాధిస్తానంటూ విజయ్ సాగుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. మొత్తంగా తన చుట్టూ నెలకొన్న ప్రతికూల పరిస్థితులను ఏమాత్రం చెరిపేసే యత్నం చేయని విజయ్ ఎన్నికల్లో ఫలితాలు రాబట్టడం కష్టమేనన్న వాదనలు అయితే బలంగానే వినిపిస్తున్నాయి.

This post was last modified on March 29, 2026 6:07 pm

Share

Recent Posts

రీమేక్ సినిమాలో ఫ్రీగా నటిస్తానన్న విజయ్

గత కొన్నేళ్లలో తమిళం నుంచి వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ‘మహారాజ’ ఒకటి. నిథిలన్ స్వామినాథన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన…

3 hours ago

దానం ఆశించిందేంటి? జ‌రిగిందేంటి?

తెలంగాణ‌లోని ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ ప‌ద‌విని కోల్పోయారు. ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టంలోని సెక్ష‌న్ 10 మేర‌కు ఆయ‌న ప‌ద‌విపై…

3 hours ago

స్టార్ల గిమ్మిక్కులు పని చేయడం లేదు

స్టార్ కాంబినేషన్లు పెట్టుకుని సరైన కథా కథనాలు లేకుండా సినిమాలు తీస్తే జనాలు ఎగబడి చూసే రోజులు పోయాయి. ముఖ్యంగా…

4 hours ago

తెలంగాణ‌లో జంపింగుల ప‌ర్వం కొత్తగా వచ్చింది కాదు

తెలంగాణలో రాజ‌కీయాల్లో 2014 నుంచి కూడా జంపింగుల ప‌ర్వం కొన‌సాగుతోంది. నేడు కొత్త‌గా వ‌చ్చింది కాదు.. భ‌విష్య‌త్తుల్లో పోయేదీ కాదని…

5 hours ago

హైదరాబాద్ ఐమాక్స్ వారణాసికి ముందే

దేశంలోనే అత్యధిక‌ సినీ అభిమానం ఉన్న‌ది తెలుగు రాష్ట్రాల్లోనే అంటే అతిశ‌యోక్తేమీ కాదు. కానీ ఇంత‌టి అభిమానం ఉన్న చోట…

10 hours ago

బెంగాల్ రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు

ప‌శ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘ‌కాలం పాటు పాల‌న సాగించిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప‌రాజ‌యం…

13 hours ago