Political News

నెల త‌ర్వాతా.. నెర‌వేర‌ని `ట్రంప్ సంక‌ల్పం!`

ఇరాన్‌పై అమెరికా+ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం ప్రారంభించి 29వ తేదీకి నెల పూర్త‌వుతుంది. గ‌త నెల 28న తెల‌తెల వారుతూనే ప్రారంభించిన డ్రోన్ దాడి ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌ను అతలాకుత‌లం చేసింది. వాస్త‌వానికి ఇలాంటి యుద్ధాలు ఎప్పుడైనా రాత్రి వేళ‌ల‌లో జ‌రుగుతాయి. భార‌త్‌.. పాకిస్థాన్‌పై చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ కూడా రాత్రివేళ‌లోనే సాగింది. అలాంటిది ప‌ట్ట‌ప‌గ‌లు.. ప్ర‌జ‌లు ఇంకా నిద్ర నుంచి మేల్కొన‌క‌ముందే.. ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడి ప్రారంభించాయి. అయితే.. నెల రోజులు గ‌డిచిన త‌ర్వాత కూడా ఈ యుద్ధానికి ఎక్క‌డా ముగింపు రాలేదు.. అమెరికా మాత్ర‌మే కాస్త బ్రేకులు వేసింది.

ట్రంప్ పిల్లిమొగ్గ‌లు!

“ఇరాన్‌పై యుద్ధం ఎందుకు చేస్తున్నారు?“ బీబీసీ ప్ర‌తినిధి ట్రంప్‌ను ఈ నెల 3న అడిగిన ప్ర‌శ్న‌. అప్ప‌టికే నాలుగు రోజులుగా యుద్ధం జ‌రుగుతోంది. ఈ స‌మ‌యంలో ఆయ‌న “చాలా పెద్ద ల‌క్ష్య‌మే ఉంది.“ అని స‌మాధానం ఇచ్చారు. అదే.. ఇరాన్‌లో రాజ‌కీయ మార్పు తీసుకురావ‌డ‌మ‌ని చెప్పారు. ఓకే.. ఈ క్ర‌మంలోనే ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ స‌హా ఆయ‌న కుటుంబాన్ని డ్రోన్ దాడుల‌తో అంతం చేశారు. కానీ,మార్పు రాలేదు. అంతేకాదు.. ఎక్క‌డా ఇరాన్‌వెన‌క్కి త‌గ్గ‌లేదు. అనేక మంది నాయ‌కులు ముందుకు వ‌చ్చారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. ట్రంప్ మ‌రో `ల‌క్ష్యాన్ని` ప్ర‌క‌టించారు.

ఇరాన్‌ను అణ్వాయుధ ర‌హితంగా చేయ‌డ‌మే త‌మ‌ల‌క్ష్య‌మ‌న్నారు. కానీ, అస‌లు త‌మ వ‌ద్ద అణ్వాయుధాలే లేవ‌ని ఇరాన్ ప్ర‌కటించింది. దీంతో ఆ ల‌క్ష్యం కూడా నెర‌వేర‌లేదు. మ‌రోవైపు.. ప్ర‌జ‌ల‌కు అధికారం అందేలా చేయ‌డ‌మే త‌న‌ లక్ష్య‌మ‌ని ట్రంప్ ప్ర‌క‌టించారు. కానీ, ఇరాన్ ప్ర‌జ‌లు ప‌క్కా మ‌త విశ్వాసులు.. దీంతో వారు పాల‌నా ప‌గ్గాల‌ను చేప‌ట్టేందుకు ముందుకు రాలేదు. పైగా ఇరాన్ పాల‌కులు నిర‌స‌న‌ల‌పై ఉక్కుపాదం మోపారు. ఇలా.. ఎప్ప‌టిక‌ప్పుడు ట్రంప్ తన ల‌క్ష్యాల‌ను మార్చుకున్నా.. వాటిని సాధించ‌లేక పోయార‌న్న‌ది వాస్త‌వం. ఈ క్ర‌మంలో అస‌లు యుద్ధం ఎవ‌రు ప్రారంభించార‌న్న ప్ర‌శ్న‌.. ట్రంప్‌ను ఉక్కిరి బిక్కిరికి గురి చేసింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా..

మ‌రోవైపు ఇరాన్ త‌న‌దైన శైలిలో ప్ర‌పంచ దేశాల‌ను టార్గెట్ చేసుకుంది. చ‌మురు ర‌వాణాను నియంత్రించ‌గ‌ల హోర్ముజ్ జ‌ల సంధిపై ప‌ట్టు పెంచుకుంది. అంతే.. ముక్కుమూసిన‌ట్టు ప్ర‌పంచం విల‌విల్లాడుతోంది. ఈ ప్ర‌భావం అమెరికాపైనే ప‌డింది. దీంతో చివ‌ర‌కు.. “మీరంతా రండి.. హోర్ముజ్ జ‌ల‌సంధిని స్వాధీనం చేసుకుందాం“ అని ట్రంప్ పిలుపునిచ్చినా.. ఆయ‌న‌కు అత్యంత విధేయులుగా ఉన్న నాటో దేశాధినేత‌లు.. మేం వ‌చ్చేది లేద‌ని తెగేసి చెప్పారు. మ‌రోవైపు గ్యాసోలిన్ స‌మ‌స్య‌తో అమెరికా ప్ర‌జ‌లు వీధుల్లోకి వ‌చ్చారు. ఇక‌, ఉపాధ్య‌క్షుడు వాన్స్‌.. యుద్ధం స‌రికాద‌ని వ్యాఖ్యానించారు. ఇలా ఇంటా బ‌య‌టాకూడా ట్రంప్‌పై విమ‌ర్శ‌లు పెరిగాయి.

భ‌విష్య‌త్తు ఏంటి?

ప్ర‌స్తుతం అమెరికా కోణంలో చూస్తే.. ఈ యుద్ధానికి విరామం ప్ర‌క‌టించారు. కానీ.. ట్రంప్ ఆలోచ‌న‌లు మాత్రం.. త‌ను విఫ‌ల‌మయ్యాన‌నే కోణం చుట్టూనే తిరుగుతున్నాయి. దీంతో ఆయ‌న వైఫ‌ల్యం దాచిపెట్టుకునేర‌కం కాదు కాబ‌ట్టి.. కొద్ది సేపు ఇరాన్ త‌న‌తో కాళ్ల బేరానికి వ‌చ్చింద‌ని.. త‌ర్వాత‌.. తానే చ‌ర్చ‌ల‌కు దిగాన‌ని ఇలా ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్నారు. తాజాగా.. ఇరాన్‌లో ధ్వంసం చేయాల్సింది చాలానే ఉంద‌ని వ్యాఖ్యానించారు. ఇలా.. ఒక తాడు బొంగ‌రం లేనివిధంగా అమెరికా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది.

100 దేశాల వార్షిక బ‌డ్జెట్ ఖ‌ర్చు

అసలు ఇరాన్‌పై యుద్ధానికి మూల‌కార‌ణ‌మైన ఇజ్రాయెల్ ప‌రిస్థితి ఏంటి? అనేది చ‌ర్చనీయాంశం. అమెరికా త‌గ్గినా.. తాను త‌గ్గేది లేద‌ని ప్ర‌క‌టిస్తూ..వ‌చ్చిన ఇజ్రాయెల్ త‌న దాడుల‌ను కొన‌సాగిస్తోంది. అయితే.. ఇప్పుడు ఇరాన్‌కు హోతీలు క‌లిసి వ‌స్తున్నారు. ఎర్ర‌స‌ముద్రంపై ప‌ట్టు పెంచుకున్న హోతీలు.. ఏక్ష‌ణ‌మైనా విజృంభిస్తే.. ప్ర‌పంచానికి ప్ర‌మాదం త‌ప్ప‌ద‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ యుద్ధం.. ల‌క్ష్యం నెర‌వేర‌క‌పోగా.. స‌మ‌స్య‌లు సృష్టించింది. ఇప్ప‌టి వ‌రకు ప్ర‌పంచ మేధావుల అంచాన ప్ర‌కారం.. 100 దేశాల వార్షిక బ‌డ్జెట్‌కు అయ్యే ఖ‌ర్చు యుద్ధం తుడిచిపెట్టేసింద‌ట‌!

Kumar

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

1 hour ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

2 hours ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

9 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

10 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

12 hours ago