Political News

మండ‌లి లేకుండా తీర్మానం.. రూల్స్ ఏమంటున్నాయ్‌!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధత క‌ల్పించాల‌న్న సంక‌ల్పంతో తాజాగా ప్ర‌త్యేకంగా అసెంబ్లీని కొలువు దీర్చింది. సుమారు 7 గంట‌ల‌పాటు సాగిన స‌భ‌లో ఏకైక అజెండాగా అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ద‌త‌ను స‌భ్యులు చ‌ర్చించారు. అనంత‌రం.. దీనిని గ‌వ‌ర్న‌ర్ ద్వారా కేంద్రానికి పంపించారు. అయితే.. అసెంబ్లీ భేటీ అయింది కానీ.. మండ‌లిని హాజ‌రు ప‌ర‌చ‌లేదు. ఈ వ్య‌వ‌హారంపై వైసీపీ నాయ‌కులు ప్ర‌భుత్వంపై నిప్పులు చెరుగుతూ.. అస‌లు మండ‌లిని హాజ‌రు ప‌ర‌చ‌కుండా అసెంబ్లీలో చేసే తీర్మానాలకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉంటుందా? పెద్ద‌ల స‌భ‌కు విలువ లేదా? మండ‌లిని ఎందుకు కొలువుదీర్చ‌లేదు.. అని వ్యాఖ్యానించారు.

నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయి?

శాసనమండలి లేకపోయినా లేదా మండలి ఆమోదం లేకపోయినా అసెంబ్లీలో తీర్మానం చేయవచ్చున‌ని రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 164-167 వ‌ర‌కు చెబుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర అసెంబ్లీకి మాత్ర‌మే విస్తృత అధికారాలు ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు, బిల్లులు లేదా `మండలి` రద్దు వంటి అంశాలపై అసెంబ్లీలో సాధారణ లేదా ప్రత్యేక మెజారిటీతో తీర్మానం ఆమోదించి గ‌వ‌ర్న‌ర్ ద్వారా కేంద్రానికి పంపవచ్చు. అంతేకాదు.. శాస‌న మండలి ఉన్నప్పటికీ, అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను ఒకసారి తిరస్కరించవచ్చు. కానీ రెండోసారి అదే తీర్మానాన్ని స‌భ‌ ఆమోదిస్తే మండలితో సంబంధం లేకుండా అది ఆమోదం పొందిన‌ట్టే.

గ‌తంలో జ‌గ‌న్ చేసిందే..

గ‌త వైసీపీ హ‌యాంలో సీఎం జ‌గ‌న్ ఏక‌ప‌క్షంగా ఈ నియ‌మాన్ని వినియోగించుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 ప్ర‌కారం.. రాష్ట్ర శాసనమండలిని అప్ప‌ట్లో ఆయ‌న రద్దు చేయడానికి ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు ఆమోదానికి పంపారు. అంతేకాదు.. మండలి రద్దు తీర్మానాన్ని కేవలం అసెంబ్లీలోనే ఆమోదించిన‌ప్పుడు.. టీడీపీ నేత‌ల ప్ర‌శ్న‌లకు కూడా క‌నీసం జ‌వాబివ్వ‌లేదు. ఇక‌, మ‌రో కీల‌క విష‌యం.. అసెంబ్లీ అనేది రాష్ట్ర ప్రజల ప్రాతినిధ్య సభ. ఎన్నికైన ప్ర‌జాప్ర‌తి నిధులు మాత్ర‌మే ఉంటారు. కాబ‌ట్టి.. ప్ర‌జాస్వామ్యంలో వీరికి పెద్ద పీట వేశారు. ఇదే విష‌యాన్ని గ‌తంలో జ‌గ‌న్ గుర్తు చేశారు.

అంతేకాదు.. మండ‌లిలో ప‌నీపాట‌లేని వారు మాత్ర‌మే ఉంటార‌ని.. వారి స‌ల‌హాలు అవ‌స‌రం లేద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించిన విష‌యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే.. జ‌గ‌న్ చేసిన‌ట్టే ప్ర‌స్తుత ప్ర‌భుత్వం చేయాలా? అంటే.. కాదు. కానీ.. విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల విష‌యంలో ప్ర‌భుత్వాల‌కు రాజ్యాంగ‌మే స్వేచ్ఛ‌నిచ్చింది. అందుకే.. నేరుగా ఈ తీర్మానాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబే ప్ర‌వేశ పెట్టారు. స‌భా నాయ‌కుడే ఒక తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత‌.. దాని ప్రాధాన్యం మారుతుంది. ఇక‌, 2వ కార‌ణం.. ఇది బిల్లు కాదు.. తీర్మానం. సో.. మండ‌లిలో ప్ర‌వేశ పెట్టి స‌ల‌హాలు.. సూచ‌న‌లు తీసుకునే అవ‌కాశం.. అవ‌స‌రం కూడా ఉండ‌దు. అందుకే స‌భ‌కు మాత్ర‌మే దీనిని ప‌రిమితం చేశారు.

Kumar

Recent Posts

యంగ్ హీరోకు త‌మిళ డిస్ట్రిబ్యూట‌ర్ ఇచ్చిన షాక్

దేశంలో తెలుగు ప్రేక్ష‌కులంత పెద్ద మ‌న‌సు ఇంకెవ‌రికీ ఉండ‌దంటూ ఇత‌ర భాష‌ల ఫిలిం మేక‌ర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా త‌మిళ…

43 minutes ago

వైసీపీకీ ఓ ‘సూపర్ యాప్’ వచ్చేసింది!

ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…

3 hours ago

కాంగ్రెస్ చెయ్యలేనిది మోదీ చేసి చూపించారు

విష‌యం చిన్న‌దే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌గా చేయ‌లేనిది.. ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…

4 hours ago

ముద్రగడకు గవర్నర్ పదవిని సిఫార్సు చేసిన పవన్

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…

4 hours ago

చెన్నై ల‌వ్ స్టోరీ ఎందుకు చేతులు మారింది?

బేబీ సినిమాతో పెద్ద సంచ‌ల‌న‌మే రేపాడు ద‌ర్శ‌క నిర్మాత సాయిరాజేష్‌. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణ‌వి చైత‌న్య‌, ఆనంద్…

6 hours ago

డ్ర‌గ్స్ కోసం ఎగ‌బ‌డ్డ ఎమ్మెల్సీ కొడుకు… ప‌ట్టేసుకున్న పోలీసులు

హైద‌రాబాద్‌ను డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి వెంటాడుతోంది. ఇటు ప్ర‌భుత్వం, అటు పోలీసులు అనుక్ష‌ణం డ్ర‌గ్స్ క‌ట్ట‌డికి ఎంతగా ప్ర‌య‌త్నిస్తున్నా.. ఏదో ఒక…

7 hours ago