ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం ఘటనలో కుట్ర కోణమేమీ లేదని తేలిపోయయింది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత రాజధాని పనులు శరవేగంగా సాగుతున్న తరుణంలో… రాయపూడి సమీపంలో మేఘా ఇంజినీరింగ్ సంస్థకు చెందిన పైపులు కాలిపోయాయి.
ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా… ఈ ఘటన వెనుక రాజధానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఈ మంటలకు కారణం కావచ్చన్న వాదనలు వినిపించాయి. అయితే సదరు పైపులకు కాపలా ఉన్న వాచ్ మన్ తనకు సెలవు ఇవ్వని కారణంగా వాటికి నిప్పు పెట్టినట్టుగా తాజాగా తేలింది. ఈ మేరకు నిందితుడిని విచారించిన పోలీసులు బాధితుడి నుంచి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు.
రాజధాని నిర్మాణ పనుల్లో మేఘా ఇంజినీరింగ్ సంస్థ కూడా పాలుపంచుకుంటోంది. పనుల్లో వినియోగించే పైపులను ముందుగానే పని ప్రదేశానికి తరలించిన ఆ సంస్థ… వాటికి కాపలాగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసింది. బెండపూడికి చెందిన రాము ఈ విధుల్లో ఉన్నాడు. అయితే ఈ నెల 23న తన బంధువులొకరు మరణించారని, సెలవు కావాలని కోరగా… అందుకు సూపర్ వైజర్ అంగీకరించలేదట.
దీంతో కోపం పెంచుకున్న రాము… ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత ఇంటికెళ్లేందుకు సిద్ధపడగా.. రాత్రి కూడా డ్యూటీ చేయాలని చెప్పడంతో అతడు మరింత ఆగ్రహానికి గురై ఏదో ఒకటి చేసి అక్కడ సెక్యూరిటీ స్టాఫ్ సంఖ్యను పెంచేలా చేయాలని తలచాడు.
ముందుగానే డీజిల్ ను ఓ సీసాలో నింపుకుని పైపుల వద్దకు కాపలా వెళ్లిన రాము…రాత్రి 10.30 గంటలకు పైపులకు నిప్పు పెట్టాడు. అయితే మంటలను చూసి భయపడ్డ రాము… వాటిని ఆర్పేందుకు యత్నించాడు. ఎంతకీ మంటలు అదుపులోకి రావడంతో అతడే సూపర్ వైజర్ కు ప్రమాదం గురించిన విషయాన్ని చెప్పాడు.
ముందుగా 9.30 గంటల సమయంలో అంతా బాగున్నట్లు ఫొటో పెట్టిన రాము… 10.35 గంటల సమయంలో మంటలు చెలరేగుతున్న ఫొటోను పంపాడు. అయితే తానే ఈ మంటలకు కారణమన్న విషయాన్నిదాచాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా…రాము ఎట్టకేలకు తానే అగ్గి రాజేసినట్లు ఒప్పుకున్నాడు.
This post was last modified on March 28, 2026 1:15 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…