Movie News

సంక్రాంతి ‘బరి’ మీద మెగా డాటర్ గురి

వరుణ్ తేజ్ హీరోగా యుదు వంశీ దర్శకత్వం వహించే బరి షూటింగ్ ఇవాళ లాంఛనంగా ప్రారంభమయ్యింది. నీహారిక కొణిదెల నిర్మాత కావడంతో ప్రత్యేక అతిథిగా ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి టీమ్ ని ఆశీర్వదించారు. గతంలో వంశీతోనే కమిటీ కుర్రాళ్ళు తీసి అవార్డులు, వసూళ్లు రాబట్టుకున్న నీహారిక ఈసారి పెద్ద బడ్జెట్ తోనే బరికి రెడీ అవుతోంది. పేరుకి స్పోర్ట్స్ డ్రామాగా కనిపిస్తున్నా విలేజ్ నేటివిటీతో ఇందులో చాలా అంశాలు ఉంటాయట.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బరిని 2027 సంక్రాంతికి విడుదల చేయాలని టీమ్ ఫిక్స్ అయిపోయింది. ఆ మేరకు ప్రెస్ మీట్ లో అఫీషియల్ గా చెప్పేశారు కూడా. మంచి సీజన్ కాబట్టి నిర్ణయం సరైనదే కానీ పోటీ చాలా గట్టిగా ఉండబోతోంది. ఆల్రెడీ అనిల్ రావిపూడి కర్చీఫ్ వేసేశారు. వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబో మూవీ పండక్కు రావడం పక్కా. చిరంజీవి – బాబీ కొల్లి సినిమా ఈ ఏడాది రాకపోతే అది కూడా ఫెస్టివల్ సెంటిమెంట్ వాడుకోవడానికి సిద్ధ పడుతుంది.

శ్రీను వైట్ల డైరెక్షన్లో శర్వానంద్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ సినిమా, నితిన్ హీరోగా సంక్రాంతి శుభాకాంక్షలు అనే ప్రాజెక్ట్ ఇదే సీజన్ ని టార్గెట్ చేసుకున్నాయి. సోగ్గాడే చిన్నినాయన సిరీస్ లో మూడో భాగం సంక్రాంతికే వస్తుందని అన్నపూర్ణ స్టూడియోస్ కొన్ని వారాల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. దసరా లేదా దీపావళి మిస్ అయితే బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమా కూడా సంక్రాంతికి దిగుతుంది. చూస్తుంటే అరడజను దాకా లిస్టులో ఉన్నాయి.

వీటిలో ఏవి మాట మీద ఉంటాయి ఏవి తప్పుకుంటాయి అనేది చెప్పలేం కానీ మొత్తానికి బరి మాత్రం చాలా పెద్ద గురి పెట్టుకుంది. 2026 సంక్రాంతికి వచ్చిన ఫలితాలు చూస్తే నాలుగు సినిమాలు ఈజీగా సేఫ్ అవుతాయని క్లారిటీ రావడంతో నిర్మాతలు ఈ రేంజ్ లో పోటీ పడుతున్నారు. అయినా కంటెంట్ బాగుంటే ఏ సీజనైనా ఒకటే కానీ జనవరిలో వసూళ్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి దాన్ని లక్ష్యంగా పెట్టుకునే వాళ్ళు ఎక్కువవుతున్నారు. చూడాలి మరి బరి ఏం చేస్తుందో. 

This post was last modified on March 28, 2026 12:51 pm

Share

Recent Posts

ఎట్ట‌కేల‌కు తెలుగులో తొలి హిట్టు

త‌మిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ శివ కార్తికేయ‌న్ లాగే టీవీ రంగం నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అమ్మాయి ప్రియ భ‌వానీ…

25 minutes ago

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

57 minutes ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

1 hour ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

1 hour ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

2 hours ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

2 hours ago