Political News

”ఆ 11 మంది పశ్చాత్తాప పడతారనుకున్నా”

నవ్యాంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా శనివారం సమావేశమైన అసెంబ్లీలో విపక్షం వైసీపీకి చెందిన 11 మంది సభ్యులపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రులతో పాటు కూటమి పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ సభ్యుల గైర్హాజరీపై మండిపడ్డారు.

చివరకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై తీర్మానం కోసం సమావేశమైన సమావేశం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యుల గైర్హాజరీపై అయ్యన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

”కనీసం ఈ రోజు అయినా ఆ 11 మంది వస్తారని ఆశించా. అమరావతి తీర్మానాన్ని బలపరచి తమ తప్పులకు పశ్చాత్తాప పడతారని భావించా. అయితే చేసిన తప్పులను సభాముఖంగా ఒప్పుకునే ధైర్యం గానీ, నిజాయతీ గానీ వారికి లేవని నాకు అర్థం అయిపోయింది. రైతన్నల ఉసురు తగిలిన తర్వాత అయినా గుణపాఠం నేర్చుకుంటారని అనుకున్నా. ఆ ఉద్దేశ్యమే వారికి లేదని తేలిపోయింది” అని వైసీపీ సభ్యుల తీరుపై అయ్యన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభ ప్రారంభం కాగానే అయ్యన్న చేసిన ఈ వ్యాఖ్యలు సభలో హర్షాతిరేకం వ్యక్తమైంది.

వాస్తవానికి అమరావతికి తామేమీ వ్యతిరేకం కాదని వైసీపీ చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అమరావతికి మద్దతుగానే అమరావతి పరిధిలోనే జగన్ ఇల్లు కట్టుకున్నారని, పార్టీ కార్యాలయాన్ని కూడా అమరావతి పరిధిలోనే నిర్మించుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే.

ఇదే వాదనను ఇటీవలే పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పారు. అయినప్పటికీ అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై చర్చ,లో పాలుపంచుకోవడానికి, తీర్మానానికి మద్దతు తెలిపేందుకు వైసీపీ సభ్యులు సభకు హాజరు కాలేదు. జగన్ అయితే ఏకంగా బెంగళూరు వెళ్లిపోయారు. ఈ విషయాలను గుర్తు చేస్తూనే స్పీకర్ వైసీపీ సభ్యుల తీరును ఎండగట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on March 28, 2026 3:23 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

7 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

10 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

11 hours ago