Political News

గతంలో బాబు, కేసీఆర్… ఇప్పుడు రేవంత్ – జీవన్ రెడ్డి

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కొంతకాలంగా సొంతపార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఊహాగానాలకు తగ్గట్లుగానే జీవన్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.

ఆ పార్టీతో ఉన్న 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నారు. జగిత్యాలలో ఈ రోజు జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో తన రాజీనామా ను జీవన్‌ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవమానాలు, అన్యాయంపై ఇంకెన్నాళ్లు ఓపిక పట్టాలి అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. పక్క పార్టీకి రాజీనామా చేయకుండానే పది మందిని చేర్చుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు.

అభివృద్ధిలో ఇతర పార్టీల నేతలు కలిసి వస్తే పరవాలేదని, కానీ, పార్టీ అంతర్గత వ్యవహారాల్లోనూ వేలు పెడితే ఎలా అని ప్రశ్నించారు. పార్టీ కష్టకాలంలో ఉన్న పది సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఒంటరి పోరాటం చేశానని, తాను మంత్రి పదవికి అర్హుడిని కాదా అని ప్రశ్నించారు.

గతంలో చంద్రబాబు, కేసీఆర్ లపై పోరాటం చేసిన తాను ఇకపై రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరూ ఎదగకూడదని రేవంత్ తన వంటివారిని అవమానిస్తున్నారా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడిచే తనవంటి నేతను అణగదొక్కుతారా అని నిలదీశారు. తన అనుచరుడిని నడిరోడ్డుపై హత్య చేసినా సహించాలా అని ప్రశ్నించారు.

This post was last modified on March 25, 2026 2:56 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

1 hour ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

3 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

4 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

12 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago