Movie News

ఆర్జీవీ.. పొగడ్తలు, పంచులకే పరిమితమా?

గత వారం రోజులుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. విదేశాల్లో సైతం ఈ సినిమా ప్రభంజనం మామూలుగా లేదు. ఐతే ఇంత సంచలనం రేపుతున్న సినిమాను ఆ చిత్ర బృందం అస్సలు ప్రమోట్ చేయట్లేదు. రిలీజ్ ముంగిట కూడా దర్శకుడు ఆదిత్య ధర్ కానీ.. హీరో రణ్వీర్ సింగ్ కానీ ‘దురంధర్-2’ ప్రమోషన్లలో పాల్గొనలేదు. రిలీజ్ తర్వాత ఏదో ఒక చిన్న ఈవెంట్లో పాల్గొన్నారు తప్పితే.. మీడియాలోకి వచ్చి ప్రమోట్ చేయడం లాంటిదేమీ చేయలేదు. కానీ లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాత్రం.. ‘దురంధర్-2’ గురించి మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

ఈ సినిమా మేకింగ్, టేకింగ్ గురించి.. ఇండస్ట్రీ మీద దీని ప్రభావం గురించి సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు. సినిమాలో ఎన్నో అద్భుతమైన విషయాల గురించి చాలా లోతుగా, తనదైన శైలిలో వర్మ విశ్లేషిస్తున్న తీరు సినీ ప్రేమికులను ఆకట్టుకుంటోంది. అదే సమయంలో ఇండస్ట్రీ మీద ఆయన పంచులు కూడా బాగా పేలుతున్నాయి.

మూస సినిమాలు తీసే ఫిలిం మేకర్స్‌కిది మేలుకొలుపు అని చెబుతూ.. అలా మేల్కొన్నా సరే ఏం తీయాలో వాళ్లకు క్లారిటీ ఉండకపోవచ్చంటూ వర్మ వ్యాఖ్యానించడం విశేషం. ఐతే ‘దురంధర్’ గొప్పదనాన్ని చెప్పడం బాగుంది. ఇండస్ట్రీ మీద పంచులు వేయడమూ ఓకే. కానీ ఈ సినిమా నుంచి వర్మ ఏం నేర్చుకుంటున్నాడు.. తదుపరి ఆయనేం చేయబోతున్నాడు అన్నది ప్రశ్న.

‘దురంధర్’ లాంటి సినిమా తీయడానికి ఆదిత్య ధర్‌కు స్ఫూర్తినిచ్చిందే వర్మ. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగకూ ఆయనే ఇన్‌స్పిరేషన్. ఇంకా ఎంతోమంది దర్శకులకు మార్గదర్శిగా నిలిచాడు వర్మ. అలాంటి దర్శకుడు గత దశాబ్ద కాలంలో ఎంత ఘోరమైన సినిమాలు తీశాడో తెలిసిందే.

బి-గ్రేడ్ అడల్ట్ సినిమాలు, పోర్న్ సినిమాలు తీసే స్థాయికి పడిపోయాడు. ఆయన వైసీపీ కోసం తీసిన పొలిటికల్ ప్రాపగండా సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

కానీ దర్శకుడిగా తాను పతనం అయిన సంగతి గుర్తించి, ప్రేక్షకులకు సారీ చెప్పడంతో పాటు ఇకపై మంచి సినిమాలు తీస్తానని హామీ ఇవ్వడం గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయన్నుంచి ‘పోలీస్ స్టేషన్లో దెయ్యం’ అనే సినిమా రాబోతోంది. అలాగే ‘సిండికేట్’ అనే భారీ సినిమాను కూడా లైన్లో పెట్టాడు వర్మ.

మరి ఈ చిత్రాలతో వర్మ ఎలాంటి ఔట్ పుట్ ఇస్తాడన్నది ఆసక్తికరం. ‘దురంధర్-2’ గొప్పదనాన్ని కొనియాడుతూ.. ఇండస్ట్రీకి పాఠాలు చెబుతున్న వర్మ.. దాన్నుంచి తానెలాంటి పాఠం నేర్చుకున్నాడు.. తన సినిమాల్లో ఎలాంటి మార్పు చూపించబోతున్నాడో చూడాలి మరి.

This post was last modified on March 25, 2026 12:56 pm

Share

Recent Posts

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

26 minutes ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

2 hours ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

3 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

3 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

4 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

4 hours ago