IPL సీజన్ వచ్చిందంటే చాలు గ్రౌండ్ లో ఆటగాళ్ల మధ్య పోరు కంటే, సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఈసారి ఈ వార్ ప్లేయర్ల నుంచి యజమానుల వైపు మళ్లింది. ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఐపీఎల్‌లోనే అత్యంత అందమైన ఓనర్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఆర్సీబీ కొత్త యజమానిగా అనన్యా బిర్లా ఎంట్రీ ఇవ్వడంతో నెట్టింట సరికొత్త చర్చ మొదలైంది. వీరిద్దరిలో ఎవరు బెస్ట్ అంటూ అభిమానులు గ్రూపులుగా విడిపోయి ఫోటోలు షేర్ చేస్తున్నారు.
అనన్యా బిర్లా ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా కుమార్తె. ఆమె కేవలం బిజినెస్ ఉమెన్ మాత్రమే కాదు, మంచి సింగర్ కూడా. ఆర్సీబీ యాజమాన్య బాధ్యతల్లో ఆమె పేరు వినిపించడంతోనే నెటిజన్లు ఆసక్తి చూపడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ‘ఎల్లె’ మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె ఫోటో చూసిన తర్వాత, కావ్య మారన్‌కు గట్టి పోటీ దొరికిందంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అనన్యా బిర్లా ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ సుమారు 16,700 కోట్ల భారీ వ్యయంతో ఈ జట్టును సొంతం చేసుకుంది.
మరోవైపు కావ్య మారన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సన్‌రైజర్స్ మ్యాచ్ ఎక్కడ జరిగినా కెమెరాలన్నీ ఆమె వైపే ఉంటాయి. టీమ్ గెలిచినప్పుడు ఆమె ఇచ్చే చిరునవ్వు, ఓడిపోయినప్పుడు చూపే బాధిత ఎక్స్ప్రెషన్స్ ఫ్యాన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు అనన్యా బిర్లా రాకతో కావ్య మారన్ హవా తగ్గిపోతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే సన్‌రైజర్స్ అభిమానులు మాత్రం ఏ రోజైనా కావ్య మారనే ఐపీఎల్ క్వీన్ అంటూ గట్టిగా వాదిస్తున్నారు.
ఈ ఇద్దరితో పాటు పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా పేరు కూడా ఈ రేసులో ఉంది. ఐపీఎల్ మొదటి సీజన్ నుండి ఆమె తన ఎనర్జీతో మైదానంలో సందడి చేస్తున్నారు. కొత్త వాళ్లు ఎంతమంది వచ్చినా ప్రీతి జింటా స్థానం వేరని కొందరు అంటుంటే, ఇప్పుడు పోటీ మాత్రం కావ్య, అనన్య మధ్యే ఉందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. దీంతో క్రికెట్ గ్రౌండ్లో మ్యాచ్ జరగకముందే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ బ్యూటీ వార్ పీక్స్‌కు చేరింది.
నిజానికి ఐపీఎల్ లో జట్ల మధ్య పోటీ ఉండటం సహజం, కానీ ఇలా యజమానుల అందం గురించి ఫ్యాన్ వార్ జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి చర్చలు వచ్చినా, ఈసారి అనన్యా బిర్లా ఎంట్రీతో అది మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఈ సీజన్లో మ్యాచ్‌లు మొదలయ్యాక మైదానంలో ఈ ఇద్దరూ తమ తమ జట్లను ఉత్సాహపరుస్తూ కనిపించే మూమెంట్స్ కోసం క్రికెట్ లవర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ బ్యూటీ వార్‌లో ఎవరి వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతారో చూడాలి.
This post was last modified on March 25, 2026 3:41 pm
వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో రూపొందుతున్న దాదా డిసెంబర్ 24 నుంచి వాయిదా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో కొత్త వెబ్ సిరీస్ 'అక్క' స్ట్రీమింగ్ అవుతోంది. కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన…
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరయ్యా అంటే ఇప్పటికీ ముందు వరసలో వినిపించే పేరు తమన్. అయితే తన స్థాయికి…
ఒకపక్క నలభై దాటని స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేసి, ఒకవేళ అది ఫ్లాప్ అయితే దాని గురించి…
ఔను అంటున్నారు అనంతపురం ప్రజలు. రాష్ట్రంలోని మొత్తం 13 కార్పొరేషన్లలో 12 కార్పొరేషన్లు టీడీపీ, జనసేన కూటమి గెలుచుకుంది. ఒక్క…
మావిగన్.. (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు నగరాలతో కూడిన రాజధాని) జగన్ చేసిన ఈ ప్రకటన వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిందే!. దీనినే తమ…