పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా.. అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. సామాన్యులకు గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఇక, వ్యాపారులకు రవాణా నిలిచిపోయి.. వ్యాపారాలు ఆగిపోయాయి. ఇక, చమురు సమస్య వెంటాడుతున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇదిలావుంటే.. కేంద్రంలోని సర్కారుకు పశ్చిమాసియా ప్రభావంతో కీలకమైన రవాణా, గ్యాస్ దిగుమతులు.. సహా ఎగుమతులు కూడా నిలిచిపోవ డం కంటిపై కునుకులేకుండా చేస్తోంది.
ఈ పరిణామాలను నిరంతరం పర్యవేక్షించేందుకు.. పరిశీలించేందుకు కేంద్రం ప్రత్యేకంగా మంత్రులు, అధికారులతో కూడిన కమిటీని నియమించింది. అయినా.. కూడా సమస్య ఎటు నుంచి ఎటు వైపు మారుతుందో తెలియని ఒక సందిగ్దత నెలకొంది. ఎందుకంటే.. ఐదురోజులు యుద్ధానికి విరామం ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ఇజ్రాయెల్ ఒత్తిడి పెరిగిపోయింది. మరోవైపు.. ప్రతిపక్ష డెమొక్రాట్లు కూడా ట్రంప్ ను ఎద్దేవా చేస్తున్నారు. ప్రపంచ మీడియా కూడా అనేక సూటి ప్రశ్నలు సంధిస్తోంది.
ఈ నేపథ్యంలో యుద్ధం ఆగుతుందా.. ఈ క్షణమే కొనసాగుతుందా? అనేది తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావం భారత్‌పై మరింత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో సామాన్యుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ప్రధాని మోడీ సైతం పశ్చిమాసియాలో ఏం జరుగుతోందన్న విషయాలపై నిరంతరం ఆరా తీస్తున్నారు. దీంతో ఆయన ఐదురాష్ట్రాల ఎన్నికల ప్రచారాన్ని దాదాపు రద్దు చేసుకున్నారని పీఎంవో వర్గాల తెలిపాయి.
దీనికి మరోకారణం కూడా..
అయితే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారాన్న ప్రధాని మోడీ రద్దు చేసుకోవడం వెనుక మరో రీజన్ కూడా ఉందని తెలుస్తోంది. ఆయా రాష్ట్రాలకు మోడీ వెళ్తే.. కేంద్రం గురించి పొగుడుకోవాలి. తప్పదుకదా!. కానీ.. పశ్చిమాసియా ప్రభావంతో సిలిండర్లపై 60 రూపాయలు పెంచారు. పెట్రోల్‌పై 2.3 రూపాయలు పెంచారు.
ఇవన్నీ.. ఇతర వస్తు అంతర్గత రవాణాపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఆయా ప్రచారానికి వెళ్లకుండా ఉంటేనే బెటర్ అని.. భావిస్తున్నారు. వెళ్తే.. తనను, తన ప్రభుత్వాన్ని కూడా మోడీ పొడుగుకోక తప్పదు. ఇదే జరిగితే.. విపక్షాలు మరింత కార్నర్ చేస్తాయి. సో.. అన్నీ ఆలోచించే ఆయన రద్దు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
This post was last modified on March 24, 2026 6:42 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…