కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన లేఖపై బీజేపీ ముద్ర కనిపించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అభ్యర్థుల నేర చరిత్ర వెల్లడింపు, ఎన్నికల ప్రచార నిబంధనలకు సంబంధించిన 2019 మార్గదర్శకాలపై ఈసీ ఇటీవల రాజకీయ పార్టీలకు లేఖ పంపింది.
అయితే ఆ లేఖపై బీజేపీ సీల్ ఉండటం వివాదానికి దారితీసింది. ఈ అంశాన్ని సీపీఎం సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేస్తూ, ఎన్నికల సంఘం తటస్థతపై ప్రశ్నలు లేవనెత్తింది. ఇప్పటికే ఈసీ, బీజేపీ కుమ్మక్కైందన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ ఘటన మరిన్ని అనుమానాలకు తావిచ్చిందని విమర్శించింది. అధికారిక లేఖపై పార్టీ ముద్ర కనిపించడం సంస్థాగత నిష్పక్షపాత వైఖరిపై సందేహాలు కలిగిస్తోందని పేర్కొంది.
అయితే ఈ వివాదంపై కేరళ ప్రధాన ఎన్నికల అధికారి రతన్ యు. కెల్కర్ స్పందిస్తూ, ఇది పూర్తిగా ‘క్లరికల్ పొరపాటు’ మాత్రమేనని స్పష్టం చేశారు. 2019 మార్గదర్శకాలపై వివరణ కోరుతూ బీజేపీ కేరళ యూనిట్ సమర్పించిన పత్రంపై పార్టీ ముద్ర ఉన్నదని, అదే పత్రాన్ని పరిశీలించే సమయంలో గుర్తించకపోవడంతో పొరపాటున ఇతర పార్టీలకు పంపిణీ చేసినట్లు వివరించారు.
ఈ లోపాన్ని గుర్తించిన వెంటనే మార్చి 21న ఆ లేఖను ఉపసంహరించుకుంటూ అధికారికంగా సవరణ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. సంబంధిత సమాచారం అన్ని రాజకీయ పార్టీలు, జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు చేరవేసినట్లు పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని, ఇలాంటి కార్యాలయ స్థాయి పొరపాట్లను ఆధారంగా చేసుకుని తప్పుదారి పట్టించే ప్రచారం చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, కేరళలో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల రాజకీయ వేడి మరింత పెరిగింది.
This post was last modified on March 24, 2026 10:15 am
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…