Movie News

చిరు సినిమాకు కోన రచన

టాలీవుడ్లో ఒకప్పుడు వైభవం చూసిన రచయితల్లో కోన వెంకట్ ఒకరు. డబ్బింగ్ సినిమా అయిన ‘సత్య’తో రచయితగా ప్రయాణం మొదలుపెట్టిన కోన… తర్వాత స్ట్రెయిట్ సినిమాలకూ పని చేసి స్టార్ స్టేటస్ సంపాదించాడు. ముఖ్యంగా ఒక దశలో శ్రీను వైట్ల‌కు ఆస్థాన రచయితగా మారాక ఆయన పని చేసిన వెంకీ, ఢీ, రెడీ, కింగ్, దూకుడు లాంటి సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే.

ఒక సమయంలో టాలీవుడ్లో నంబర్ వన్ రైటర్‌గా ఒక వెలుగు వెలిగాడు కోన. కానీ తర్వాత ఆయన రైటర్‌గా పని చేసిన సినిమాలు వరుసగా ఫెయిలవడం మొదలైంది. దీంతో ఆయన క్రమంగా సైడ్ అయిపోయారు. ఇప్పుడు రైటర్‌గా కోనకు సినిమాలు బాగా తగ్గిపోయాయి.

ఐతే ఇప్పటికీ కోనతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపించే దర్శకుడు ఒకడున్నారు. అతనే.. బాబీ కొల్లి. అతడికి కోనను గాడ్ ఫాదర్ అని చెప్పొచ్చు. ఫాం కోల్పోయాక కోనతో కూాడా జై లవకుశ, వాల్తేరు వీరయ్య లాంటి చిత్రాలకు పని చేయించుకున్నాడు బాబీ. ఇప్పుడు చిరుతో చేయబోయే కొత్త సినిమాకు కూడా కోన నుంచి రచనా సహకారం తీసుకుంటున్నాడు బాబీ.

తన నిర్మాణంలో తెరకెక్కిన ‘బ్యాండ్ మేళం’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. తాను చిరు సినిమాకు పని చేస్తున్న విషయాన్ని వెల్లడించాడు కోన. ఆ విషయాన్ని వెల్లడించే ముందు ఆయనొక ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ విసిరారు.

ఈ మధ్య ‘‘ఈ సినిమా నచ్చకపోతే..’ అంటూ ఫిలిం సెలబ్రెటీలు స్టేజ్ మీద ఛాలెంజ్‌లు విసరడం ట్రెండుగా మారిన సంగతి తెలిసిందే. కోన కూడా ఇదే బాటలో సాగాడు. ‘బ్యాండ్ మేళం’ సినిమా నచ్చకపోతే తర్వాత తాను రైటర్‌గా పని చేసే సినిమా చూడొద్దని ఆయనన్నారు.

మీకు నచ్చినా, నచ్చకపోయినా రాస్తూనే ఉంటా అని చెప్పిన కోన.. ‘బ్యాండ్ మేళం’ నచ్చకపోతే మాత్రం నిజంగానే తాను రాసే తర్వాతి సినిమా చూడొద్దని తేల్చి చెప్పాడు. ఐతే ఈ మాట వింటే రేప్పొద్దున చిరంజీవి గారు ఫోన్ చేసి తిడతాడని.. ఎందుకంటే తాను తర్వాత రాయబోయే సినిమా ఆయనదే అని.. బాబీ దర్శకత్వంలో పని చేస్తున్న ఆ చిత్రానికి తాను రైటర్ అని వెల్లడించాడు కోన.

This post was last modified on March 24, 2026 7:14 am

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

4 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

7 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

7 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

7 hours ago