తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు కావాలని..సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో పనిచేయాలని చాలా మంది తలపోశారు. గత ఏడాది జరిగిన మంత్రి వర్గ ప్రక్షాళనలో చాలా మంది తమకు సీటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ, వారికి ఆశలు ఫలించలేదు. కేవలం ముగ్గురిని మాత్రమే మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ కూడా ఉన్నారు.
అయితే..అప్పట్లో మంత్రులు కావాలని అనుకున్నవారికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి.. `విప్` పదవులు ఇచ్చి సంతోష పెట్టే ప్రయత్నం చేశారు. ఉగాది సందర్భంగా `విప్`ల జాబితాను ప్రకటించారు. ఇటు అసెంబ్లీలోనూ.. అటు శాసన మండలిలోనూ.. పలువురు నాయకులకు విప్‌ల హోదా కల్పించారు. వీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మండలి సభ్యులను సమన్వయం చేయనున్నారు. తద్వారా.. వారికి మంత్రి పదవులు ఇవ్వకపోయినా.. `విప్`లతో సంతృప్తి పరిచారు.
అసెంబ్లీలో విప్‌లు వీరే..
+ వేముల వీరేశం: నకిరేకల్ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. ఈయన మంత్రి వర్గంలో చోటుకోసం శతథా ప్రయత్నాలు చేశారు. కానీ, లభించలేదు. చివరి నిముషం వరకు కూడా ఆయన పేరు మంత్రి వర్గ జాబితాలో వినిపించింది.
+ విజయ రమణారావు: పెద్దపల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఈయన మంత్రి వర్గ రేసులో లేక పోయినా.. ప్రయత్నాలు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇక, ఇప్పుడు విప్‌తో ఆయనను సంతృప్తి పరిచారు.
+ యెన్నం శ్రీనివాస్ రెడ్డి: మహబూబ్‌నగర్ నుంచి గెలుపు గుర్రం ఎక్కారు. మంత్రి వర్గంలో చోటు ఖాయమని ప్రచారం చేసుకున్నారు. కానీ.. ఆయన పేరు ఈ జాబితాలో ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం విప్ పదవి వరించింది.
శాసనమండలిలో
+ అద్దంకి దయాకర్: మంత్రివర్గ రేసులో ఆది నుంచి వినిపించిన నాయకుల పేర్లలో దయాకర్ పేరు ప్రముఖంగా ఉంది. కానీ, అవకాశం చిక్కలేదు. తాజాగా మండలిలో విప్ అయ్యారు.
+ బల్మూరి వెంకట్ : ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరున్న వెంకట్ పేరును కూడా మంత్రి వర్గం జాబితాలో చేర్చారన్న వార్తలు వచ్చాయి. కానీ.. ఈయన పేరును పరిగణనలోకి తీసుకోలేదు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ అప్పట్లోనే చెప్పారు. “బల్మూరన్నకు ఇంకా ఫ్యూచర్ ఉంది“ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు విప్‌ను చేశారు.
This post was last modified on March 20, 2026 2:43 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…