Movie News

జమీల్ జమాలి… ఈయన మామూలోడు కాదు

బాక్సాఫీస్ వద్ద చెడుగుడు ఆడుతున్న దురంధర్ ది రివెంజ్ సినిమాలో నటుడు రాకేష్ బేడీ పోషించిన పాత్ర ఓ రేంజ్ లో పేలింది. ఆ ట్విస్టు ఇక్కడ చెప్పడం భావ్యం కాదు కానీ థియేటర్ ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు ఆదిత్య ధార్ తనని డిజైన్ చేసిన విధానం చూస్తే వావ్ అనకుండా ఉండలేం. విడుదలకు ముందు రణ్వీర్ సింగ్ అన్నట్టు ఈ మూవీకి వెయ్యి కోట్లు వస్తే అందులో సగం రాజేష్ బేడీ వల్లేనని సరదాగా అన్నా ఇప్పుడిదే హైలైటవుతోంది.

నక్కజిత్తుల పాకిస్థాన్ మంత్రి జమీల్ జమాలిగా రాకేష్ బేడీ చూపించిన వేరియేషన్స్ రెండు భాగాల్లో గొప్పగా పేలాయి. మేరా బేటా అంటూ మెత్తగా వెన్నుపోటు పొడిచే ఆయన టైమింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే రాకేష్ బేడీకి ఇంత భారీ గుర్తింపు ఆయన నూటా యాభైకి పైగా సినిమాల్లో ఎప్పుడూ రాలేదన్నది వాస్తవం. 1979 హమారే తుమారేతో తెరంగేట్రం చేసిన రాకేష్ ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో సపోర్టింగ్ రోల్స్ దక్కించుకున్నారు. వాటిలో గదర్ లాంటివి ఉన్నాయి.

అయితే ఈయన ఆషామాషీ నటుడు కాదు. గొప్ప రంగస్థల కళాకారుడు. మసాజ్ అనే నాటకంలో ఏకంగా 24 పాత్రలు పోషించి తన విశ్వరూపాన్ని చూపించడం ఒకప్పుడు గొప్పగా చెప్పుకునేవారు. ముఖ్యంగా టీవీ సీరియల్స్ లో రాజేష్ బేడీకి చాలా గొప్ప పేరుంది. దూరదర్శన్ ని ఊపేసిన యే జో హై జిందగీ, శ్రీమాన్ శ్రీమతిలకు వీరాభిమానులు ఉండేవారు. భాభీ జీ ఘర్ పర్ హైన్, తారక్ మెహతా కా ఊల్తా చష్మా కూడా ఇంతే స్థాయిలో గొప్ప విజయం అందుకున్నాయి.

ఇప్పుడు దురంధర్ రివెంజ్ పుణ్యమాని రాజేష్ బేడీ సోషల్ మీడియా హాట్ టాపిక్ అయ్యారు. నిన్నా మొన్నటిదాకా ఆఫర్ల కోసం ఎదురు చూసిన ఈ విలక్షణ నటుడికి వరస కాల్స్ వస్తున్నాయట. అయిదింతల ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్న నిర్మాతలు పది దాకా ఉన్నారట. దీన్ని బట్టే రాకేష్ బేడీ ఏ రేంజ్ కు ఎదిగారో అర్థం చేసుకోవచ్చు. దురంధర్ దర్శకుడు ఆదిత్య ధార్ ఇంతకు ముందు తీసిన యురి ది సర్జికల్ స్ట్రైక్ లో కూడా రాకేష్ బేడీ కీలక పాత్ర పోషించడం గమనించాల్సిన విషయం.

This post was last modified on March 20, 2026 7:31 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

57 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago