ఒకప్పుడు తెలుగులో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాలనే మాటే ఉండేది కాదు. ‘మనీ’ లాంటి ఒకటీ అరా సినిమాలకు మాత్రమే సీక్వెల్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. సినిమా హిట్టయినా కాకపోయినా సీక్వెల్స్ అనౌన్స్ చేసేస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత ఊపందుకున్న ట్రెండ్ ఇది. ఇదే బాటలో వేరే ఇండస్ట్రీలు కూడా నడుస్తున్నాయి.
హిందీలో ముందు నుంచి సీక్వెల్, ఫ్రాంఛైజీ సినిమాల ట్రెండ్ ఉండగా.. అది గత దశాబ్ద కాలంలో మరింత ఊపందుకుంది. హాలీవుడ్లో ఎప్పటినుండో ఈ ట్రెండు ఉన్న సంగతి తెలిసిందే. ఒక హిట్ సినిమాకు సీక్వెల్ వస్తే హైప్ మామూలుగా ఉండట్లేదు. భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. టాక్ బాగుంటే ఆ సినిమా రేంజే వేరుగా ఉంటోంది.
బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాంటి చిత్రాల సీక్వెల్స్ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనం రేపాయో తెలిసిందే. ఇప్పుడు ‘దురంధర్’ సైతం అదే బాటలో సాగుతోంది. బుధవారం ఈవెనింగ్ షోలతో మొదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సాగిస్తోంది.
విశేషం ఏంటంటే.. ‘దురంధర్-2’ థియేటర్లలో విధ్వంసం సృష్టిస్తున్న సమయంలోనే అనేక సీక్వెల్స్ వెండితెరల్లో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ సంగతే తీసుకుంటే.. హాలీవుడ్ ఫ్రాంఛైజీ మూవీస్ అయిన జుటోపియా-2, డెమాన్ స్లేయర్: కిమెట్సు నో యైబా-ఇన్ఫినిటీ క్యాజిల్ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్నాయి. ఇవి రిలీజ్ అయి చాలా రోజులైనా సరే.. ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతున్నాయి.
మరోవైపు హిందీ చిత్రం ‘లవ్ మాక్‌టైల్-3’తో పాటు ‘కేరళ స్టోరీ-2’ కూడా ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్నాయి. మరోవైపు మలయాళ సీక్వెల్ అయిన ‘ఆడు-3’ సైతం ఇప్పుడు థియేటర్లలో ఆడుతోంది. హైదరాబాద్‌లో కూడా దీనికి షోలు నడుస్తున్నాయి. మొత్తంగా ఆరు సీక్వెల్-ఫ్రాంఛైజీ సినిమాలు ప్రస్తుతం థియేటర్లలో నడుస్తుండడం విశేషం. దీన్ని బట్టి ఇప్పుడు సీక్వెల్, ఫ్రాంఛైజీ సినిమాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on March 20, 2026 5:10 pm
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…
సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…