Political News

జ‌గ‌న్ జ‌గ్ర‌త్త‌… అప‌రిచిత ఐఏఎస్‌ లేఖ‌?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు కొన్ని జాగ్ర‌త్త‌లు సూచిస్తూ.. ఓ అప‌రిచిత ఐఏఎస్ లేఖ రాసిన‌ట్టు వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. స‌ద‌రు ఐఏఎస్ అధికారి ఎవ‌రు? అనే విష‌యాన్ని మాత్రం గోప్యం ఉంచారు. వాస్త‌వానికి ఆ ఐఏఎస్ అదికారి కూడా త‌న పేరును వెల్ల‌డించ‌కుండానే.. ఈ లేఖ రాసిన‌ట్టు చెబుతున్నారు. గ‌త వైసీపీ హ‌యాంలో కీల‌క పోస్టులో ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ఐఏఎస్ అధికారే ఈ లేఖ రాసి ఉంటార‌ని అంటున్నారు.

లేఖ సారాంశం ఇదీ..

జ‌గ‌న్‌కు ఈ లేఖ‌లో స‌ద‌రు ఐఏఎస్ అధికారి కొన్ని సూచ‌న‌లు చేసిన‌ట్టు పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ప్ర‌ధానంగా జ‌గ‌న్‌ను.. మ‌రింత పలుచన చేసేందుకు రాజ‌కీయ వ్యూహాలు రెడీ అవుతున్నాయ‌న్న‌ది ఆయ‌న చెప్పిన‌ట్టుగా వైసీపీ నాయ‌కులు తెలిపారు. జ‌గ‌న్‌ను ఉత్త‌ర కొరియా అధిప‌తి `కిమ్‌`మాదిరిగా సృష్టించ‌నున్నార‌ని.. దీనిపై ప్ర‌జ‌ల్లో ప్రచారం చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌న్న‌ది ఆయ‌న వాద‌న‌గా ఉంద‌ని అంటున్నారు.

ఇదేస‌మ‌యంలో.. జ‌గ‌న్ బ‌య‌ట‌కు రాక‌పోతే.. మ‌రింతగా పార్టీ న‌ష్ట‌పోతుంద‌ని.. తాను చేసిన‌వి చెప్పుకోవడంలో జ‌గ‌న్ వెనుక‌బ‌డ్డార‌ని.. ఆయ‌నే ఒప్పుకొన్న విష‌యాన్ని కూడా ఐఏఎస్ అధికారి లేఖ‌లో ప్ర‌స్తావించార‌ని కూడా పేర్కొంటున్నారు. అంతేకాదు.. కార్య‌క‌ర్త‌ల‌కు ఇప్ప‌టి నుంచే మ‌రింత భ‌రోసా క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. వారు ఉత్తేజంగా లేక‌పోవ‌డం.. పార్టీ ప‌రంగా కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు కాక‌పోవ‌డం వంటివి కూడా జ‌గ‌న్‌కు ఇబ్బందేన‌ని ఆయ‌న పేర్కొన్న‌ట్టు పార్టీ నాయ‌కులు తెలిపారు.

ప్ర‌స్తుతం వివాదాల‌పైనా స‌ద‌రు ఐఏఎస్ అధికారి జ‌గ‌న్‌కు కీల‌క సూచ‌న‌లు చేశార‌ని తెలిసింది. తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారంపై వైసీపీ మౌనంగా ఉండాల‌ని.. మ‌ద్యం కుంభ‌కోణంపైనా ఇదే విధానం పాటించాల‌ని ఆయ‌న సూచించారు. అదేస‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి అతిగా అంచ‌నాలు వేసుకోకుండా.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నించి అడుగులు వేయాల‌ని ఆయ‌న సూచించ‌డం గ‌మ‌నార్హం. అయితే.. స‌ద‌రు ఐఏఎస్ ఏపీకి చెందిన వ్య‌క్తి కాద‌ని కొంద‌రు చెబుతున్నారు. ఉత్త‌రాదికి చెందిన వ్య‌క్తి అని కొంద‌రు చెబుతున్నారు.

This post was last modified on March 20, 2026 11:05 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

1 hour ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago