Political News

బెజవాడ నడిబొడ్డున ముద్రగడ విగ్రహం

కాపు ఉద్యమ నేత, సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం విగ్రహం బెజవాడలో త్వరలోనే ఏర్పాటు కానుంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన ముద్రగడ… మెజారిటీ కాలం కాపులకు ప్రత్యేక రిజర్వేషన్ల సాధన కొరకే కేటాయించారు. కాపుల కోటా కోసం ముద్రగడ చేపట్టిన వినూత్న నిరసనలు ఈ తరానికి తెలియవేమో గానీ… తెలుగు నేల రాజకీయాలపై ఓ మోస్తరు అవగాహన ఉన్న వారెవరికైనా ఇట్టే గుర్తుకు రాక మానవు. కులం కోసం రాజకీయాలనే పక్కనపెట్టి మరీ పోరాటం సాగించిన ముద్రగడ ప్రస్థానాన్ని భావి తరాలకు గుర్తుండేలా చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా ముద్రగడ విగ్రహం ఒకటి త్వరలోనే విజయవాడ వీధుల్లో ఏర్పాటు కానుంది.

ముద్రగడ మరణం నేపథ్యంలో ఆయన సంస్మరణార్థం శనివారం విజయవాడలో కాపులు ఏర్పాటు చేసిన సమావేశానికి రాజకీయ పార్టీలకు అతీతంగా కాపు నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇలా ముద్రగడకు నివాళి అర్పించేందుకు వచ్చిన వారిలో టీడీపీ కీలక నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, వైసీపీలో కీలక నేతగా కొనసాగుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. వేర్వేరు పార్టీల్లో ఉంటూ నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ సాగుతున్న ఈ ఇద్దరు నేతలు ముద్రగడ సంస్మరణ సమావేశం కోసం ఒకే వేదిక మీదకు చేరడం గమనార్హం. 

ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేసిన బొండా ఉమా విజయవాడలో త్వరలోనే ముద్రగడ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. నగరంలో ఏ ప్రదేశంలో ముద్రగడ విగ్రహం ఏర్పాటు చేయాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నామని, త్వరలోనే దీనిపై అధికారికంగా ఓ ప్రకటన చేస్తామని కూడా ఆయన తెలిపారు. కాపులను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో ముద్రగడ తీవ్రంగా శ్రమించారని, చివరకు కాపులంతా ఐక్యతగా సాగేలా ఆయన చేయగలిగారని కూడా ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీకి అదికారం దక్కాలన్నా… కాపుల ఓట్లే కీలకంగా మారిన పరిస్థితులకు ముద్రగడ కూడా ఓ కారణమని ఆయన పేర్కొన్నారు.

కాపుల్లో మెజారిటీ ఓట్లు ఏ పార్టికి పడితే ఆ పార్టీకే అధికార పీఠం దక్కుతోందని బొండా ఉమా చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో ఈ తరహా పరిస్థితి విస్పష్టంగా కనిపించిందని ఆయన తెలిపారు. రాష్ట్ర జనాభా 5కోట్లు ఉంటే… అందులో ఏకంగా కోటికి పైగా ఉన్న కాపుల ఓట్లు అధికార పార్టీని నిర్ణయించడంలో కీలక భూమిక పోషిస్తున్నాయన్నారు. 2019 ఎన్నికల్లో కాపుల ఓట్లు పడకపోవడంతోనే టీడీపీ ఓటమిపాలైందని ఆయన చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రసంగించిన అంబటి… మాట కోసం పేరు మార్చుకున్న ఒకే ఒక్క నేతగా ముద్రగడ నిలిచారని అన్నారు. 

This post was last modified on July 25, 2026 6:54 pm

Share

Recent Posts

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

49 minutes ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

5 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

7 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

8 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

10 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

10 hours ago