Movie News

విజయ్ బలహీనతే కిరణ్ బలం

బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో జన నాయకుడు, చెన్నై లవ్ స్టోరీ విడుదలైన సంగతి తెలిసిందే. నేరుగా ఇలా క్లాష్ అవ్వడం వల్ల కలెక్షన్లు ప్రభావితం చెందుతాయనే ప్రశ్న కిరణ్ అబ్బవరంకు ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలలో ఎదురయ్యింది. తనతో పాటు నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా అలాంటిది ఏమీ ఉండదని, తమ కంటెంట్ ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పుకొచ్చారు.

కట్ చేస్తే రెండు సినిమాల తీర్పులు వచ్చేశాయి. తమిళంలో ఏమో కానీ తెలుగులో జన నాయకుడుకి తిరస్కారం ఎదురైనట్టే. భగవంత్ కేసరి రీమేక్ కావడం, చేసిన మార్పులు ఏ మాత్రం మెప్పించేలా లేకపోవడం పబ్లిక్ టాక్ ని ప్రభావితం చేస్తోంది. దీంతో మొదటి రోజు డీసెంట్ గా ఉన్న కలెక్షన్లు శనివారానికి తగ్గుముఖం పట్టడం కనిపించింది. పక్క రాష్ట్రంలో హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి కానీ ఏపీ తెలంగాణలో అంత సీన్ లేదని అర్థమైపోయింది.

విజయ్ సినిమాలో ఉన్న బలహీనత కిరణ్ కు వరంగా మారింది. స్క్రీన్లు తక్కువగా ఉన్న బిసి సెంటర్లలో జన నాయకుడుకి ఇచ్చిన ఎక్కువ షోలను తగ్గించి వాటిని చెన్నై లవ్ స్టోరీకి కేటాయిస్తున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మూడు వందలకు పైగా స్క్రీన్లను కిరణ్ కు కేటాయించడం చూస్తుంటే జనాల టాక్ ఏ స్థాయిలో రీచ్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం మొత్తం చెన్నై లవ్ స్టోరీ డామినేషనని వేరే చెప్పనక్కర్లేదు.

ఒకవేళ జన నాయకుడు కనక లియో, మాస్టర్ లాగా స్ట్రెయిట్ సబ్జెక్ట్ ప్లస్ బలమైన కంటెంట్ ఉండి ఉంటే కనక చెన్నై లవ్ స్టోరీకి ఖచ్చితంగా కాంపిటీషన్ అయ్యేది. ఇంత టాక్ తెలిసిన తర్వాత కూడా ఒక్కసారి విజయ్ చివరి సినిమా చూసేద్దామని సహృదయత చూపిస్తున్న తెలుగు ఆడియన్స్ లేకపోలేదు. అందుకే ప్రధాన కేంద్రాల్లో మంచి ఆక్యుపెన్సీలే ఉన్నాయి. ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ సోమవారం నుంచి కిరణ్ పెర్ఫార్మన్స్ ఎలా ఉండబోతోందో చూడాలి. 

This post was last modified on July 26, 2026 6:51 am

Share

Recent Posts

జత్వానీ కేసులో ఐపీఎస్‌లకు భారీ ఊరట… తక్షణమే విధుల్లోకి!

నటి జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు విశాల్‌ గున్ని, కాంతి రాణా టాటాలపై ఉన్న సస్పెన్షన్‌ను…

20 minutes ago

మూణ్నెల్లు ఒకరినొకరు చూసుకోని విజయ్, రష్మిక

రష్మిక మందన్నాది ప్రస్తుతం ఇండియాలో దాదాపుగా నంబర్ వన్ హీరోయిన్ స్థానం. తాజాగా ఇండియా టుడే కూడా ఆ విషయాన్ని…

44 minutes ago

సూర్య 50… రోలెక్స్ అయ్యే ఛాన్సుందా

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన యాభై సినిమాకు చేరువవుతున్నాడు. ప్రస్తుతం పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న మూవీ షూటింగ్…

1 hour ago

నిర్మాత మాట… సినిమాలు ఊరికే ఆడట్లేదు

ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. కానీ తర్వాత నాలుగు నెలల పాటు బాక్సాఫీస్‌లో హాహాకారాలు తప్పలేదు. నిఖార్సయిన…

2 hours ago

మూడేళ్ళ లోటుని ‘ఎపిక్’ తీర్చాలి

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' సెప్టెంబర్ 11 విడుదల…

2 hours ago

ఛాలెంజుల మీద దృష్టి పెట్టిన ప్రేక్షకులు

ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో సహ మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ఫోకస్ పడుతూనే ఉంది. హీరో…

3 hours ago