ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై 30 విడుదల కానున్న సంగతి తెలిసిందే. వారం ముందే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టేశారు. నగరాల్లోని ఐమాక్స్, ప్రీమియం మల్టీప్లెక్సుల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ది ఒడిస్సికి రెండింతల ఎక్కువ స్థాయిలో దీనికి షాకింగ్ నెంబర్స్ నమోదు కాబోతున్నాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. తెలుగుతో సహా అన్ని వెర్షన్లలో 3డి టెక్నాలజీ ఉంటుంది.
ఈసారి స్పైడర్ మ్యాన్ ప్రత్యేకత ఏంటంటే చిన్న పిల్లలు క్రేజీగా భావించే హల్క్ తోడవుతున్నాడు. నెగటివ్ షేడ్స్ తో మొదలుపెట్టి క్రమంగా సాలీడు మనిషికి సహాయం చేసే పాత్రలో గూస్ బంప్స్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట. విలన్ గా తేలు మనిషి అంటే స్కార్పియన్ మ్యాన్ ని దించుతున్నారు. ట్రైలర్ లో చిత్ర విచిత్ర విన్యాసాలు అంచనాలు పెంచేలా ఉన్నాయి. వాటిని 3డిలో చూస్తే ఆడియన్స్ ఇంకెలా ఊగిపోతారో ప్రత్యేకంగా చెప్పాలా. ఆ స్థాయిలో హైప్ ఉంది.
మన దగ్గరే కాదు అన్ని భాషల్లోనూ కంటెంట్ కి ప్రాధాన్యం ఇస్తున్న జనాలు అది ఏ దేశం నుంచి వచ్చిందనేది పట్టించుకోవడం లేదు. అసలు మనకు పరిచయమే కానీ గ్రీకు వీరుల గాధని ది ఒడిస్సిలో చూపిస్తే ఎగబడి చూశారు. అలాంటిది చిన్నప్పటి నుంచి దశాబ్దాలుగా చూస్తున్న స్పైడర్ మ్యాన్ కి ఏ రేంజ్ లో ఎగబడతారో వేరే చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ వరకు చూసుకుంటే అదే రోజు వస్తున్న శ్రీనివాస మంగాపురంకు స్పైడర్ మ్యాన్ వల్ల ఇబ్బంది తప్పేలా లేదు.
టామ్ హాలండ్, జెండాయా తదితరులు నటించిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇండియా వైడ్ ఓపెనింగ్ యాభై కోట్ల నుంచి మొదలవుతుందని ఒక అంచనా. ఒకవేళ టాక్ పాజిటివ్ గా వస్తే మాత్రం వసూళ్లకు ఆకాశమే హద్దవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ పెద్ద సినిమాలేవీ ఆ తేదీకి వచ్చేందుకు రిస్క్ చేయలేదు. స్క్రీన్లు తగినన్ని అందుబాటులో ఉండటంతో వసూళ్ల పరంగా నిర్మాతలు ధీమాగా ఉన్నారు. చూడాలి స్పైడర్ మ్యాన్ ఎలాంటి వండర్స్ చేయబోతున్నాడో.
This post was last modified on July 25, 2026 9:49 pm
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…
సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…