అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ.80 కోట్లు పెట్టి ఈ సినిమాను నిర్మిస్తే.. థియేటర్ల నుంచి అందులో పావు వంతు కూడా వెనక్కి రాలేదు. కలెక్షన్ల సంగతి పక్కన పెట్టి, కంటెంట్ గురించి మాట్లాడకుంటే.. ఇందులో హీరో క్యారెక్టర్ దగ్గర్నుంచి ఏదీ వర్కవుట్ కాలేదు.
సుకుమారంగా కనిపించే అఖిల్‌ను వైల్డ్ బీస్ట్‌గా ప్రెజెంట్ చేయాలన్న ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. తన లుక్, యాక్టింగ్ ఏదీ అస్సలు సూట్ కాలేదు. ఇప్పుడు స్వయంగా అఖిలే తన క్యారెక్టర్, యాక్టింగ్ విషయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడు. ఆ సినిమాను తనను చూస్తే తనకే అసహ్యం కలిగినట్లు అఖిల్ ఒక పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ సినిమా ఫలితమేంటో రష్ ఎడిట్ రూంలోనే అర్థమైపోయిందని, ఆ విషయాన్ని ఓపెన్‌గా తన సన్నిహితులతో చెప్పానని అఖిల్ వెల్లడించాడు.
‘‘విడుదలకు ముందు మన సినిమా చూసుకున్నపుడు అదెలా ఉందో, దానికి ఎలాంటి ఫలితం వస్తుందో అర్థమైపోతుంది. ‘ఏజెంట్’ సినిమాను నేను చూసుకున్నపుడే ఏదో తేడాగా ఉందని అర్థమైంది. కామన్ ఫ్రెండ్స్‌కు ఓపెన్‌గా విషయం చెప్పేశా. సినిమా తేడా కొట్టేలా ఉందని అన్నాను. కానీ ఆ పరిస్థితుల్లో దాన్ని కాపాడడానికి నేనేం చేయగలనని ఆలోచించా. దేవుడా ఏదైనా మార్గం ఉంటే చెప్పమని వేడుకున్నా. ఎందుకంటే నిర్మాత అన్ని కోట్లు పెట్టాక సినిమా కోసం నిలబడడం మన బాధ్యత. అందుకే నేను చేయగలిగింది చేశా.
ఒక సినిమా ఫెయిల్యూర్‌కు వంద కారణాలుండొచ్చు. అందులో మన బాధ్యత ఎంత అన్నది కూడా చూడాలి. ఆ సినిమాలో నేను సరిగా నటించలేదు. అందులో నన్ను నేను చూసుకుంటే నాకు అసహ్యమేసింది. ప్రతి సీన్లోనూ ఓవర్ రియాక్ట్ అయినట్లు కనిపించింది. బైక్ ఫస్ట్ గేర్లో పెట్టి విపరీతంగా రైజ్ చేస్తే ఎలా ఉంటుందో నా నటన అలా సాగింది’’ అంటూ ఏజెంట్‌లో తప్పుల గురించి కుండబద్దలు కొట్టేశాడు అఖిల్. ఐతే ఈ ఫెయిల్యూర్‌కు ఏ ఒక్కరినో నిందించలేమంటూ అందరం సమానంగా క్రెడిట్ తీసుకోవాల్సిందే అని అఖిల్ ఇంతకుముందే వ్యాఖ్యానించాడు.
This post was last modified on July 26, 2026 6:51 am
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…
సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…