Movie News

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే జరుగుతూ ఉంది. పోస్టర్ మీద ఆ చిత్రం రూ.500 కోట్ల వసూళ్లు సాధించినట్లు మేకర్స్ వేసుకోగా.. ఆ ఫిగర్ ఒరిజినల్ కాదంటూ అప్పట్లో పెద్ద డిస్కషన్ నడిచింది. హిందీ వెర్షన్ మాత్రమే రూ.84 కోట్లు రాబట్టినట్లు చెప్పడమూ అతిశయోక్తిగా అనిపించింది. ఐతే ఈ చర్చ అప్పుడే అయిపోలేదు. ఏళ్ల తరబడి ‘దేవర’ కలెక్షన్ల డిస్కషన్ కొనసాగుతూనే ఉంది. యాంటీ ఫ్యాన్స్ దాని మీద కౌంటర్లు వేస్తూనే ఉంటారు. ఎన్టీఆర్ అభిమానులు వారితో గొడవ పడుతూనే ఉంటారు. 

ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసిన నాగవంశీని ‘దేవర’ వసూళ్ల గురించి నెటిజన్లు ప్రశ్నిస్తూనే ఉంటారు. ఆయన దీని మీద ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడింది లేదు. ఐతే ఈ చిత్రాన్ని కొన్ని ఏరియాల వరకు సబ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుని రిలీజ్ చేసిన నిర్మాత ధీరజ్ మొగిలినేని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘దేవర’ కలెక్షన్ల గురించి మాట్లాడాడు. దేవర ఫైనల్ కలెక్షన్లు ఎంత అన్నది చెప్పలేదు కానీ.. తమ అంచనాలను మించి వసూళ్లు రాబట్టిందని ఆయన స్పష్టం చేశాడు.

‘‘దేవర అన్నది ఒక మిరాకిల్. నేను మూడు ఏరియాల్లో ఆ చిత్రాన్ని రిలీజ్ చేశాను. ఆ మూడు చోట్లా చాలా పెద్ద నంబర్లు వచ్చాయి. మేం ఊహించిన దాని కంటే సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు కూడా రెండో వారం నుంచి డౌన్ అయిపోతున్నాయి. ముందు అనుకున్న కలెక్షన్లు రావట్లేదు. కానీ ‘దేవర’ అలా కాదు. నాలుగో వారంలో కూడా చెప్పుకోదగ్గ షేర్ వచ్చింది. ఆ చిత్రానికి అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోలు వేశాం. వాటి నుంచి కొంచెం డివైడ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. ముందు రోజు రాత్రి సెకండ్ షో వేసినా, తెల్లవారుజామున షోలు పడినా ఇబ్బంది ఉండదు. 

కానీ అర్ధరాత్రి షో వేస్తే ప్రేక్షకులకు నిద్ర లేక, మైండ్ కొంచెం ఆఫ్ అవడం వల్ల సినిమా సరిగా చూడరు. అందువల్ల డివైడ్ టాక్ వచ్చిందనుకుంటా. అయినా సరే తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని షోలు వేస్తే అన్నీ ఫుల్స్ పడ్డాయి. ఐదు, ఆరు షోలు వేసినా ఫుల్ అయ్యాయి. తర్వాత కూడా సినిమా బాగా ఆడింది. ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాను తమ భుజాల మీద మోశారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ కావడంతో సినిమాకు లాంగ్ రన్ వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లుగా మేం అంచనా వేసిన దాని కంటే 50 శాతం ఎక్కువే కలెక్ట్ చేసింది. ఇదంతా ఎన్టీఆర్ గారి పవర్, సినిమాలో ఉన్న కంటెంట్ వల్లే సాధ్యమైంది’’ అని ధీరజ్ తెలిపాడు.

This post was last modified on July 25, 2026 10:51 pm

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

3 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

5 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

5 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

7 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

8 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

9 hours ago