దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ నేతృత్వంలోని కూటమి పాలిత పుదుచ్చేరి సహా.. ప్రాంతీయ పార్టీలైన డీఎంకే పాలిస్తున్న తమిళనాడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కొనసాగుతున్న పశ్చిమ బెంగాల్, కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న కేరళ ఉన్నాయి. అయితే.. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, పుదుచ్చేరీలపై బీజేపీ చాలానే ఆశలు పెట్టుకుంది.
కేరళలో ఎలానూ పాగావేయలేమని నిర్ణయించుకున్న కమలనాథులు.. మిగిలిన నాలుగు రాష్ట్రాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వీటిలోనూ తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మరింత ఎక్కువగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఈ రెండే అతి పెద్ద రాష్ట్రాలు. పైగా తమిళనా డు.. దక్షిణాదిలోనే పెద్ద రాష్ట్రం కావడంతో(240 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి) ఇక్కడ పాగా వేయాలన్నది పార్టీ ఆలోచన. ఇక, పశ్చిమ బెంగాల్ పై పట్టు బిగిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలావుంటే.. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోడీ మ్యానియానే(ప్రభావం) బీజేపీకి కీలకంగా మారాలి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ స్థానిక ప్రభావం ఎలా ఉన్నప్పటికీ.. మోడీ మ్యానియానే పార్టీ వర్గాలు నమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కూడా అదే మ్యానియాపై ఆశలు పెట్టుకున్నాయి. అయితే.. 2024 పార్లమెంటు ఎన్నికల్లో మోడీ ప్రభావం దేశం మొత్తంపై తగ్గింది. దీంతో పార్లమెంటులో మేజిక్ ఫిగర్‌ను బీజేపీ దక్కించుకోలేక పోయింది. ఫలితంగా ఇటు టీడీపీ, అటు జేడీయూ మిత్రపక్షాలను కలుపుకొని కేంద్రంలో తొలిసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.
ఇక, 2024 తర్వాత.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటికీ.. అక్కడ మోడీ మ్యానియా కంటే కూడా.. నితీష్‌కుమార్ హవా పనిచేసిందన్న ప్రచారం ఉంది. పైగా ఉచిత హామీలు, మహిళలకు అప్పటికప్పుడు రూ.10 వేల చొప్పున బ్యాంకులో వేయడం వంటివి ఎన్నికలపై ప్రభావం చూపించాయి. ఈ పరిణామాల క్రమంలో ఇప్పుడు మోడీ ప్రభావం ఎంత? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మోడీపై వ్యతిరేకత పెరుగుతున్నట్టు జాతీయ మీడియా సర్వేలు చెబుతున్నాయి.
ముఖ్యంగా ఇప్పటికిప్పుడు పెరిగిన గ్యాస్ సంక్షోభాన్ని నిలువరించే ప్రయత్నం చేయకపోగా.. బండకు రూ.60 చొప్పున పెంచడం వంటివి మోడీ హవాను తగ్గించాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. మరోవైపు.. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో స్థానికంగా ఉన్న ప్రభుత్వాలపై కొంత మేరకు వ్యతిరేకత ఉన్నప్పటికీ.. అవి మోడీని బలపరిచేంతగా ప్రభావం చూపించే అవకాశం లేదని కూడా తెలుస్తోంది. అలాగే.. అంతర్జాతీయంగా అమెరికా చెప్పు చేతల్లో మోడీ ఉన్నారన్న కాంగ్రెస్ ప్రచారం కూడా బలంగా పనిచేస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఈ పరిణామాలకు తోడు.. జీఎస్టీ శ్లాబులు తగ్గించినా.. అవి సామాన్యులకు అందడం లేదు. పైగా ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావాలన్నీ.. మోడీ మ్యానియాను దారుణంగా పడేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ ప్రభావం ఇప్పుడు ఎన్నికలపై చూపిస్తే.. మోడీ మాటను ప్రజలు విశ్వసించే అవకాశం ఉండదని అంటున్నారు. ఇదిలావుంటే.. ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను మోడీ మొత్తంగా 12 రోజులు నిర్ణయించుకుని.. తర్వాత.. దీనిని 7-8 రోజులకు కుదించుకున్నారు. ఇవన్నీ.. ఆయన ప్రభావాన్ని తగ్గించడాన్ని సూచిస్తున్నాయని అంటున్నారు.
This post was last modified on March 17, 2026 1:40 pm
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…
రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…