Movie News

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ తొలిప్రేమలో ఒక సాంగ్ ని రీమిక్స్ చేసి పవన్ మీద చిత్రీకరించామని అన్నారు. ఆ పాట ఏదో నేరుగా చెప్పలేదు కానీ ఇన్ సైడ్ సోర్స్, పోస్టర్ లో పవన్ శ్రీలీల ఉన్న స్టిల్ చూస్తుంటే అది ‘ ఈ మనసే నా మనసే పరిగెడుతోంది నీకేసే ” అంటూ దేవా కంపోజింగ్ లో సీతారామశాస్త్రి గారు రాసింది మ్యాచ్ అవుతోంది.

ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం థియేటర్లలో ఓ రేంజ్ బ్లాస్ట్ ఉంటుంది. కొందరు ఫ్యాన్స్ ” ఏమైందో ఏమో ఈ వేళా ” అనుకుంటున్నారు. రీమిక్స్ సాంగ్ ఏదైనా అదొక సెలబ్రేషన్ లా ఉండిపోతుంది. మాములుగా పవన్ సాంగ్స్ ని వేరే హీరోలు వాడుకోవడం గతంలో చాలాసార్లు జరిగింది. గుండె జారీ గల్లంతయ్యిందేలో నితిన్ ఇదే తొలిప్రేమ పాటను పెట్టుకుని అభిమానులను ఆకట్టుకున్నాడు. తన అభిమాన హీరో మీద ప్రేమను ఆ రూపంలో చాటుకున్నాడు.

ఇప్పుడు పవనే తన సాంగ్ రీమిక్స్ కి డాన్స్ చేయడం అంటే అదో స్పెషల్ మూమెంట్ అవుతుంది. రిలీజ్ కు ఇంకో రోజున్నర మాత్రమే టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది. ఓజి తర్వాత వస్తున్న సినిమాగా అంచనాలు దాని స్థాయిలో లేకపోయినా ఒక షో పడ్డాక సీన్ మొత్తం మారిపోతుందని, వైబ్ మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ మీదకు వస్తుందని నమ్మకంగా ఉన్నారు. దానికి తోడు హరీష్ శంకర్ పంచుకుంటున్న విషయాలు ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.

దురంధర్ రివెంజ్ తో పోటీ ఉన్నప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఇబ్బందేం లేదు. తగినన్ని థియేటర్లు షోలు ఉన్నాయి. బెనిఫిట్ షో నుంచి బాగుందనే మాట ఒక్కటి బయటికి వస్తే చాలు రికార్డుల మోత మొదలవుతుంది. ఇది చాలా కీలకం. ఏపీలో ఉదయం అయిదు గంటల నుంచే షోలు పడనుండగా తెలంగాణ ఫ్యాన్స్ మాత్రం ఏడు దాకా వెయిట్ చేయాల్సిందే. కాకపోతే ఎక్స్ ట్రా రేట్లు లేకుండా సాధారణ ధరలకే చూడాల్సి రావడం నైజామ్ మూవీ లవర్స్ కు పెద్ద ఊరట.

This post was last modified on March 17, 2026 3:22 pm

Share

Recent Posts

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

13 minutes ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

41 minutes ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

52 minutes ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

2 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

2 hours ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

4 hours ago