ఓటు లేక‌పోతే… ప‌థ‌కాలు క‌ట్: రేవంత్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!!

రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్ర‌భుత్వం నుంచి సంక్షేమ ప‌థ‌కాల‌ను ఎలా అందిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఎవ‌రి ఓటును వారు భ‌ద్రంగా చూసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ఓటు పోకుండా ఎవ‌రికి వారు జాగ్ర‌త్త వ‌హించాల‌న్నారు. ఓట‌రు జాబితాలో పేరు లేని వారికి సంక్షేమం ఇచ్చే విష‌యంలో ప్ర‌భుత్వం పున‌రాలోచిస్తుంద‌ని ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ విష‌యంలో కేంద్రం కూడా అలానే ఉంద‌ని తెలిపారు. ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాల్లో సంక్షేమాన్ని క‌ట్ చేశార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఇక‌, తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌పై త‌ప్పుడు ఫిర్యాదులు(కంప్లెయింట్‌) చేస్తున్నార‌ని.. త‌ప్పులు చేసేవారిని వ‌దిలి పెట్ట‌న‌ని.. బొక్క‌లో వేయిస్తాన‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. త‌న‌కు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయ‌ని ఆరోపిస్తున్న వారు వాటిని నిరూపించాల‌ని అన్నారు. ఇప్ప‌టికే త‌న ఓటును ఒక చోట నుంచి మ‌రో చోట‌కు బ‌దిలీ చేసుకున్న‌ట్టు తెలిపారు. ఈ విష‌యాన్ని దాచి పెట్టి త‌న‌పై ఫిర్యాదులు చేస్తున్నార‌ని ఆరోపించారు.

బీఆర్ ఎస్‌కు బాధ్య‌త ఉందా?

విద్యార్థులు, నిరుద్యోగుల స‌మ‌స్యల విష‌యంలో తమ‌కు పేపెంట్ హ‌క్కు ఉంద‌ని చెబుతున్న బీఆర్ఎస్ నాయ‌కులు ఇప్పుడు ఎందుకు నోరు ఎత్త‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి నిల‌దీశారు. దేశ‌వ్యాప్తంగా నీట్ పేప‌ర్ లీకై విద్యార్థులు ఉద్య‌మిస్తున్నార‌ని.. అలాంటి వారికి అండ‌గా కాంగ్రెస్ పార్టీ స‌హా ఇత‌ర విప‌క్షాలు కూడా క‌లిసి ముందుకువ‌చ్చాయ‌ని తెలిపారు. కేంద్ర మంత్రి ధ‌ర్మేం ద్ర‌ప్ర‌ధాన్ రాజీనామాకు ప‌ట్టుబడుతున్నాయ‌ని చెప్పారు. ఇలాంటి స‌మ‌యంలో బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంద‌ని ఇదేనా విద్యార్థుల విష‌యంలో బాధ్య‌త అని నిల‌దీశారు.

బీఎల్ ఏలే కీల‌కం!

ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌రుగుతున్న ఓట‌ర్ల జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ విష‌యంలో బూత్ లెవిల్ ఏజెంట్ల‌ను నియ‌మించామ‌న్నారు. వారే ఈ విష‌యంలో అత్యంత కీల‌క‌మ‌ని వ్యాఖ్యానించారు. ఓట‌ర్ల జాబితాను తారు మారు చేసే అవ‌కాశం ఉంద‌ని.. బీఎల్ ఏలు ఈ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఓటు ఉంటేనే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు వ‌స్తాయ‌ని తేల్చి చెప్పారు. “ఓటు లేకుండా.. ఓటు వేయ‌కుండా.. ప్ర‌భుత్వం నుంచి ప‌థ‌కాల‌ను ఎలా ఆశిస్తారు. ఇలా ఇవ్వ‌డం ఎలా సాధ్యం?“ అని ప్ర‌శ్నించారు.