Political News

తెలంగాణ కాంగ్రెస్‌లో పరకాల చిచ్చు!

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో తాజాగా పరకాల నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో 2023లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ నుంచి రావూరి ప్రకాశ్ రెడ్డి గెలిచారు. ప్రస్తుతం ఆయనే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే గత కొన్నాళ్లుగా ఈ నియోజకవర్గంపై కన్నేసిన మంత్రి కొండా సురేఖ కుటుంబం తాజాగా మరింత దూకుడు ప్రదర్శించింది. పరకాల గడ్డపైనే కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతేకాదు పరకాలను తమ సొంత ఇలాకాగా గట్టిగా పేర్కొన్నారు.

తాజాగా ఇక్కడ జరిగిన కొమ్మాల జాతరకు మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మురళి, కుమార్తె సుస్మితా పటేల్ హాజరయ్యారు. అయితే జాతరకు వచ్చిన వారు కార్యక్రమంతో ముగించకుండా రాజకీయ వ్యాఖ్యలు చేయడంతో పరకాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇది తమ అడ్డా అని, ఇక్కడ నుంచి తామే పోటీ చేస్తామని కొండా మురళి వ్యాఖ్యానించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచే తాము పోటీలోకి దిగుతామని కూడా తెలిపారు. ఈ క్రమంలో ఆయన కుమార్తె సుస్మిత మరొక అడుగు ముందుకు వేసింది.

తానో ఫైర్ బ్రాండ్ అని వ్యాఖ్యానించిన సుస్మిత, తన తండ్రి జాగ్రత్తగా మాట్లాడాలని సూచించిన నేపథ్యంలో కొంచెం తగ్గి మాట్లాడుతున్నానని చెప్పింది. లేదంటే తానేంటో ఇప్పుడే చూపించేదాన్నని వ్యాఖ్యానించింది. ఇక నుంచి పరకాల నియోజకవర్గంలోనే పర్యటించనున్నట్టు తెలిపింది. “ఇక్కడి సమస్యలు నాకు తెలుసు. ఎవరు ఏం చేస్తున్నారో ఇంకా బాగా తెలుసు” అంటూ సుస్మిత పరోక్షంగా ఎమ్మెల్యే రావూరిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం. పరకాల నుంచే తాను పోటీ చేస్తానని కూడా ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో ఈ టికెట్ తనదేనని ధీమా వ్యక్తం చేసింది.

వాస్తవానికి మంత్రి సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ తరచుగా పరకాలపై ఈ కుటుంబం దృష్టి పెట్టుతోంది. మరోవైపు గత ఎన్నికల్లో గెలిచిన రావూరి ప్రకాశ్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఆయనకు పార్టీ సీనియర్ల మద్దతు కూడా ఉందని చెబుతున్నారు. అయితే కొండా కుటుంబం దూకుడు కారణంగా పరకాల నియోజకవర్గంలో రాజకీయాలు తరచూ వేడెక్కుతున్నాయి. తాజాగా కుటుంబం మొత్తం పరకాల గడ్డపైనే వ్యాఖ్యలు చేయడం, సుస్మిత తనను తాను ఫైర్ బ్రాండ్‌గా చెప్పుకోవడం, వచ్చే ఎన్నికల్లో టికెట్ తమదేనని మురళి ప్రకటించడం వంటి పరిణామాలు అధికార పార్టీలో పరకాల రాజకీయాలను మరింత వేడెక్కించే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.

This post was last modified on March 6, 2026 1:36 pm

Share

Recent Posts

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

9 minutes ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

2 hours ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

2 hours ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

2 hours ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

4 hours ago

విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి… ఈ మూడే కూట‌మికి కీల‌కం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి కీల‌కంగా మారిన మూడు మునిసిప‌ల్‌ కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు..…

4 hours ago